MLC Balmuri Venkat: బ్లాక్‌మెయిల్ చేసినందుకే కౌశిక్‌రెడ్డి అరెస్ట్.. బల్మూరి వెంకట్ హాట్ కామెంట్స్
ABN , Publish Date - Jun 21 , 2025 | 03:40 PM
కౌశిక్‌రెడ్డిది బ్లాక్‌మెయిల్ చరిత్ర అని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి కౌశిక్‌రెడ్డి చాలా పైసలు తీసుకున్నారని బల్మూరి వెంకట్ అన్నారు.

హైదరాబాద్: హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి అరెస్ట్‌ను (Huzurabad MLA Padi Kaushik Reddy Arrest) మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్‌రావు ఖండిస్తున్నందుకు సిగ్గుండాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ (MLC Balmuri Venkat) విమర్శించారు. పైసల దందాలో కౌశిక్‌రెడ్డి అరెస్ట్ అయ్యారని ఎద్దేవా చేశారు. కేటీఆర్, హరీష్‌రావు ఒక్క దొంగకి సపోర్ట్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై కౌశిక్‌రెడ్డి ఏమైనా ఉద్యమం చేశారా అని ప్రశ్నించారు. పైసల కోసం క్రషర్ వాళ్లని బ్లాక్‌మెయిల్ చేసినందుకు కౌశిక్‌రెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్.
కౌశిక్‌రెడ్డిది బ్లాక్‌మెయిల్ చరిత్ర అని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఆరోపించారు. ప్రజలను మోసం చేసిన చరిత్ర కౌశిక్ రెడ్డిదని విమర్శించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని నిరుద్యోగుల నుంచి కౌశిక్‌రెడ్డి చాలా పైసలు తీసుకున్నారని అన్నారు. ఫోన్ ట్యాపింగ్ దొంగలను బయట దేశాలకు పంపించినట్లుగా కౌశిక్‌రెడ్డిని కూడా దేశం దాటించాలని చూశారని ఆరోపించారు. ఇవాళ(శనివారం) గాంధీభవన్‌లో బల్మూరి వెంకట్ మీడియాతో మాట్లాడారు. తమ ఎమ్మెల్యే బ్లాక్ మెయిలర్ అని హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు బాధ పడుతున్నారని చెప్పారు. కౌశిక్‌రెడ్డిని గెలిపించినందుకు చాలా బాధపడుతున్నారని పేర్కొన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్.
కేటీఆర్, హరీష్‌రావులు దొంగలకు సపోర్ట్ చేయొద్దని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హితవు పలికారు. మీరు చేసిన దొంగతనాలు బయట పడతాయని బావ బామ్మర్ధులు బనకచర్ల విషయంలో ముందుగా మాట్లాడుతున్నారని విమర్శించారు. బనకచర్ల విషయంలో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డితో లోపాయికారి ఒప్పందాలు చేసుకుంది మీరు కాదా అని ప్రశ్నించారు. బావ బామ్మర్ధులకు దమ్ము ధైర్యం ఉంటే బనకచర్ల విషయంలో ప్రమాణం చేయాలని బల్మూరి వెంకట్ సవాల్ విసిరారు. వాసాలమర్రిలో ఆగమ్మకు ఇల్లు ఇస్తామని మాజీ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారని.. ఆ హామీ ఎందుకు నిలబెట్టుకోలేదని ప్రశ్నించారు. కేసీఆర్ పేపర్ టైగర్ అని ఎద్దేవా చేశారు. ఆగమ్మకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిందని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి
సిట్ ముందుకు ప్రణీత్ రావు.. 650 ఫోన్ల ట్యాప్‌పైనే విచారణ
యోగా డేలో తొక్కిసలాట.. స్పృహకోల్పోయిన యువతి
భార్యపై అనుమానం.. బిడ్డలపై ఘాతుకం... రవిశంకర్ అరెస్ట్
Read latest Telangana News And Telugu News