KTR: రేవంత్ ప్రభుత్వం.. అందాల పోటీతో పాటు అగ్నిప్రమాదాలపైనా ఫోకస్ పెట్టాలి
ABN , Publish Date - May 19 , 2025 | 02:50 PM
KTR: రేవంత్ ప్రభుత్వం అగ్ని ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని మాజీ మంత్రి కేటీఆర్ కోరారు. వేసవి నేపథ్యంలో అగ్నిమాపక సిబ్బందితో ప్రభుత్వం సమీక్ష సమావేశాలు నిర్వహించాలని కేటీఆర్ సూచించారు.

హైదరాబాద్: పాతబస్తీలోని గుల్జార్‌హౌస్‌లో(Gulzar House) మే 18వ తేదీ తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగి 17 మంది మృతిచెందారు. ఈ ఘటనపై పలువురు ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ(సోమవారం) బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(KTR) ఘటన స్థలాన్ని పరిశీలించారు. అగ్నిప్రమాద మృతుల కుటుంబ సభ్యులను కేటీఆర్ పరామర్శించి ధైర్యం చెప్పారు. 17 మంది మృతులకు శ్రద్ధాంజలి ఘటించారు. రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.
రేవంత్ ప్రభుత్వం అందాల పోటీల మీదే కాదు.. అగ్నిప్రమాదాల మీద కూడా ఫోకస్ పెట్టాలని మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. అగ్నిప్రమాదంలో మరో ప్రాణం పోకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. తాను ఈ ఘటన గురించి రాజకీయంగా మాట్లాడటానికి ఇక్కడకు రాలేదని చెప్పారు. ప్రభుత్వాలు ప్రజల ప్రాణాలు కాపాడాలని కోరారు. రేవంత్ ప్రభుత్వం రూ. 5 లక్షల పరిహారం ఇవ్వడం కాదని.. ప్రజల ప్రాణాలపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. బాధిత కుటుంబాలకు రేవంత్ ప్రభుత్వం రూ. 25 లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రే హోం మినిస్టర్‌గా ఉన్నారని.. ఆ ఘటన స్థలానికి వచ్చి ఉంటే అధికారులు ఇంకా బాగా పనిచేసేవారని మాజీ మంత్రి కేటీఆర్ తెలిపారు.
వేసవి నేపథ్యంలో అగ్నిమాపక సిబ్బందితో ప్రభుత్వం సమీక్ష సమావేశాలు నిర్వహించాలని మాజీ మంత్రి కేటీఆర్ సూచించారు. ఘటన స్థలానికి ఫైర్ ఇంజన్లు సకాలంలో వచ్చాయి కానీ వాటర్ లేదని బాధితులు చెబుతున్నారని అన్నారు. సిబ్బందికి సరైన మాస్కులు కూడా రేవంత్ ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. అంబులెన్స్‌లో ఆక్సిజన్ సిలిండర్ లేకపోవడం దురదృష్టకరమని అన్నారు. హైదరాబాద్‌లో ఇదే అత్యంత భారీ అగ్ని ప్రమాదమని తెలిపారు. నిన్నటి రోజు అత్యంత దుర్భరమైన రోజుగా బాధిత కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
HYD Fire Accident: ఓల్డ్‌సిటీ ఫైర్ యాక్సిడెంట్‌కి కారణం.. స్థానిక అక్రమ కరెంట్ కనెక్షన్లు.!
Gulzar House Fire Incident: గుల్జార్ హౌస్ ప్రమాదంపై ఎఫ్‌ఐఆర్ నమోదు
Hydra Demolitions: హైడ్రా కూల్చివేతలు షూరూ.. టెన్షన్ టెన్షన్
Read Latest Telangana News And Telugu News