Share News

Harish Rao: కాళేశ్వరం కమిషన్‌‌కి కీలక విషయాలు చెప్పిన హరీష్‌రావు

ABN , Publish Date - Jul 11 , 2025 | 12:12 PM

కాళేశ్వరం కమిషన్ చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఎదుట మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు విచారణకు హాజరయ్యారు. బీఆర్‌కే భవన్‌లో మరోసారి పీసీ ఘోష్‌ కమిషన్‌ను హరీష్‌రావు కలిశారు.

Harish Rao: కాళేశ్వరం కమిషన్‌‌కి కీలక విషయాలు చెప్పిన హరీష్‌రావు
BRS MLA Harish Rao

హైదరాబాద్‌: కాళేశ్వరం కమిషన్ (Kaleshwaram Commission) చీఫ్ జస్టిస్ పినాకి చంద్రఘోష్ ఎదుట మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు (BRS MLA Harish Rao) ఇవాళ(శుక్రవారం) విచారణకు హాజరయ్యారు. బీఆర్‌కే భవన్‌లో మరోసారి పీసీ ఘోష్‌ కమిషన్‌ను హరీష్‌రావు కలిశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై మరింత అదనపు సమాచారాన్ని ఇచ్చారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్‌లపై ఆరుసార్లు కేబినెట్‌ ఆమోదం, అలాగే అసెంబ్లీలో కూడా మూడుసార్లు ఆమోదం తెలిపిందని గుర్తుచేశారు. ఈ వివరాలన్నీ డాక్యుమెంట్లతో సహా కమిషన్‌కు ఇచ్చానని తెలిపారు. మిగిలిన వివరాలు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయని వెల్లడించారు మాజీ మంత్రి హరీష్‌రావు.


అసెంబ్లీలో కూడా మూడుసార్లు ఆమోదించారని మాజీ మంత్రి హరీష్‌రావు తెలిపారు. ఈ వివరాలన్నీ డాక్యుమెంట్లతో సహా కమిషన్‌కు ఇచ్చానని చెప్పుకొచ్చారు. మిగిలిన వివరాలు రేవంత్ ప్రభుత్వం దగ్గరే ఉన్నాయని వివరించారు. కమిషన్‌కు కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి సమాచారం ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి చెప్పినవన్నీ అసత్యాలేనని ఆరోపించారు. 50 ఏళ్లుగా కాంగ్రెస్‌వి అబద్ధాలు, మోసాలేనని విమర్శించారు. కృష్ణా జలాల్లో 299 టీఎంసీల కేటాయింపు కాంగ్రెస్‌ పాపమేనని మండిపడ్డారు. సెక్షన్‌ 3 కింద నీళ్లు పంపిణీ చేయాలని అప్పుడే అడిగారని హరీశ్‌రావు గుర్తుచేశారు.


ప్రజా భవన్‌లో కాళేశ్వరంపై ఇచ్చింది పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కాదు...కవర్ పాయింట్ ప్రజెంటేషన్ అని మాజీ మంత్రి హరీష్‌రావు ఎద్దేవా చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి అజ్ఞానం, అహంకారం బయటపెట్టుకున్నారని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ 50 ఏళ్లు చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకోవడానికి కవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారని దెప్పిపొడిచారు. 299 టీఎంసీల పేరుతో శాశత్వ ఒప్పందమని సీఎం రేవంత్‌రెడ్డి అబద్ధపు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ఆనాడే 299 టీఎంసీలకి ఉమ్మడి రాష్ట్రంలో ఒప్పందం చేశారని గుర్తుచేశారు. శాశ్వత ఒప్పందం కేసీఆర్ చేసి ఉంటే...సెక్షన్ 3 కోసం పోరాటం ఎందుకు చేస్తారని నిలదీశారు.సెక్షన్-3 విషయంలో ఉమా భారతి, గడ్కరీనీ కలిశారని చెప్పుకొచ్చారు మాజీ మంత్రి హరీష్‌రావు.


కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేసి సెక్షన్-3ని కేసీఆర్ సాధించారని మాజీ మంత్రి హరీష్‌రావు ఉద్ఘాటించారు. బోర్డు తాత్కాలిక నీటి వినియోగం కోసం ఒప్పందం చేస్తుందని తెలిపారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎం రేవంత్‌రెడ్డి సైతం 299 టీఎంసీలకు సంతకాలు చేశారని మరి మీరు ఎలా చేశారని ప్రశ్నించారు. కృష్ణా నదిలో తెలంగాణ వాటాను రేవంత్ ప్రభుత్వం సాధించాలని కోరారు. రేవంత్ రెడ్డి అజ్ఞానంతో మాట్లాడారని.. తాను చాలా బాధతో చెబుతున్నానని అన్నారు. కృష్ణానదిని దోచుకో అని రేవంత్ రెడ్డి చంద్రబాబుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి అజ్ఞానాన్ని తాను బయటపెట్టిన తర్వాత ఆయన మాట మార్చారని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్‌రెడ్డికి ఎలాగూ తెలియదు... ఉత్తమ్ కుమార్ రెడ్డికి కూడా తెలీదు అంటే బాధేస్తోందని చెప్పారు. సీఎం చంద్రబాబు నాయుడు చెప్పినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందా అని ప్రశ్నించారు. 573 టీఎంసీలు చాలని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పడం అజ్ఞానమని విమర్శించారు మాజీ మంత్రి హరీష్‌రావు.


ఆ ప్రాజెక్ట్‌లని రేవంత్‌రెడ్డి ఖాతాలో వేసుకున్నారు

‘400 ఏళ్ల కింద కాకతీయులు, నిజాం కాలంలో కట్టిన ప్రాజెక్ట్‌లని రేవంత్‌రెడ్డి ఖాతాలో వేసుకున్నారు. దేశానికి స్వాతంత్రం రాకముందు కట్టిన ప్రాజెక్ట్‌లను కూడా ఆయన ఖాతాలో వేసుకున్నారు. కాంగ్రెస్ 6లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తే...బీఆర్ఎస్ పాలనలో 48 లక్షల ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. తుమ్మడిహెట్టి నుంచి బ్యారేజ్ మార్పుపై సీఎం రేవంత్‌రెడ్డి కేంద్రప్రభుత్వాన్ని తప్పుబడుతున్నారు. కేంద్రం ఎందుకు అనుమతి ఇచ్చిందో ప్రశ్నించండి. 160 టీఎంసీలకు కేంద్రం నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు అనుమతి తేలేదు?. అసెంబ్లీలో చర్చకు మేము సిద్ధం. మా మైక్ కట్ చేయకుండా, అసెంబ్లీ నుంచి పారిపోవద్దు. రేవంత్ 20 నెలల పాలనలో ఇప్పుడు ఒక్క చెరువు, చెక్ డ్యామ్ అయినా కట్టించారా.?. కేసీఆర్ ప్రభుత్వం ఏం చేయనిది నీళ్లు ఎలా వచ్చాయి.. పంటలు ఎలా పండాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నీళ్లను వాడటం లేదు... 6శాతం నీళ్లను తక్కువగా వాడారు’ అని హరీష్‌రావు విమర్శించారు.


ఈ వార్తలు కూడా చదవండి

గుడ్ న్యూస్.. జర్నలిస్ట్ అవ్వాలనుకుంటున్నారా.. యువతకు ఆంధ్రజ్యోతి ఆహ్వానం

హైదరాబాద్‌లో కల్తీ కల్లు ఘటన.. పెరిగిన మృతులు

Read Latest Telangana News and Telugu News

Updated Date - Jul 11 , 2025 | 03:58 PM