Share News

Cyber ​​Security Police: శభాష్ సైబర్ పోలీస్.. ఆన్‌లైన్ మోసాలకు చెక్

ABN , Publish Date - Aug 03 , 2025 | 05:52 PM

పలువురు అమాయకులను ఆన్‌లైన్ ట్రేడింగ్, ఇన్వెస్ట్‌మెంట్ స్కామ్‌ల పేరుతో మోసం చేస్తున్న సైబర్ కేటుగాళ్లని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. 2025 సంవత్సరంలో 228 మంది నిందితులను అరెస్టు చేశామని తెలిపారు

Cyber ​​Security Police: శభాష్ సైబర్ పోలీస్.. ఆన్‌లైన్ మోసాలకు చెక్
Cyber ​​Security

హైదరాబాద్: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (Telangana Cyber Security Bureau) రాష్ట్రంలో ఎప్పటికప్పుడు సైబర్ నేరాలపై తన ఉక్కుపాదం మోపుతుంది. రాష్ట్రవ్యాప్తంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న ముఠాలను అరెస్ట్ చేస్తూ.. తనదైన శైలీలో దూసుకుపోతుంది. సైబర్ నేరాలను వెంట వెంటనే పరిష్కరిస్తూ.. అటూ.. ప్రజలతో, ఇటూ.. ప్రభుత్వంతో ఔరా అనిపించుకుంటుంది. తాజాగా 2025 సంవత్సరంలో 228 మంది సైబర్ నేరగాళ్లను అరెస్ట్ చేసి శభాష్ అనిపించింది.


సైబర్ క్రైమ్‌లో అరెస్ట్ అయిన నిందితులపై దేశవ్యాప్తంగా 1313 కేసులు, తెలంగాణలో 1089 కేసులు నమోదైనట్లు గుర్తించింది సైబర్ సెక్యూరిటీ బ్యూరో. ఈ మేరకు ఇందుకు సంబంధించిన వివరాలను ఇవాళ (ఆదివారం) సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు వెల్లడించారు. ఇప్పటి వరకు రూ. 92 కోట్లు మోసం చేసినట్లు విచారణలో వెల్లడించారు. 66 మంది ఫేక్ కాల్ సెంటర్ నేరాల్లో అరెస్టు, 77 మంది ఇన్వెస్ట్‌మెంట్, జాబ్ ఫ్రాడ్ కేసులో అరెస్టు చేశారు.


మరో 18 మంది సైబర్ నేరాలు, 13 మంది ఆన్‌లైన్ ట్రేడింగ్ ఫ్రాడ్, డిజిటల్ అరెస్ట్ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. నిందితుల్లో ఎక్కువగా ప్రైవేటు ఉద్యోగులు, విద్యార్థులు, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లు, బ్యాంక్ ఉద్యోగులు ఉన్నట్లు గుర్తించారు. ఫేక్ కాల్ సెంటర్ కేసులో గుజరాత్‌లో 63 మందిని అరెస్టు చేశారు. అమెరికా పౌరులని టార్గెట్ చేస్తూ మోసాలకు సైబర్ కేటుగాళ్లు పాల్పడుతున్నారు. అలాగే సూరత్ కేంద్రంగా సైబర్ నేరాలకు పాల్పడుతున్న 20 మందిని అరెస్టు చేశారు. ఆన్‌లైన్‌లో లైంగిక వేధింపుల కేసుల్లో 15 మందిని ఈ ఏడాది అరెస్ట్ చేశామని సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు వెల్లడించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సిందూర్, మహదేవ్ ఆపరేషన్‌లు కొత్త చరిత్రను సృష్టించాయి: వెంకయ్యనాయుడు

ఆ పీఠాన్ని టార్గెట్ చేసుకున్న బీఆర్ఎస్.. అసలు ప్లాన్ ఇదేనా..?

Read latest Telangana News And Telugu News

Updated Date - Aug 03 , 2025 | 06:07 PM