Ramachandra Rao: బీసీలకు కాంగ్రెస్ అన్యాయం.. రామచందర్‌రావు ఫైర్
ABN , Publish Date - Jul 14 , 2025 | 01:44 PM
తెలంగాణలో తాము అధికారంలోకి రావడం ఖాయమని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు రామచందర్‌రావు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని నొక్కిచెప్పారు. తమ కార్యకర్తల కళ త్వరలో నెరవేరబోతుందని పేర్కొన్నారు.

నల్లగొండ: అర్హత ఉన్న అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు (Ramachandra Rao) డిమాండ్ చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ కార్యకర్తలకే రేషన్ కార్డులు ఇస్తున్నారని.. మిగతా వారి పరిస్థితి ఏమిటనీ ప్రశ్నించారు. రేషన్ బియ్యాన్ని కేంద్ర ప్రభుత్వమే ఇస్తోందని స్పష్టం చేశారు. రేషన్ షాపుల్లో ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఫొటో పెట్టాలని సూచించారు. ఇవాళ(సోమవారం) నల్గొండ జిల్లాలో రామచందర్‌రావు పర్యటించారు. ఆయనకు బీజేపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. బీజేపీ నేతలకు రాబోయే ఎన్నికలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా రామచందర్‌రావు మీడియాతో మాట్లాడారు.
తెలంగాణలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని నొక్కిచెప్పారు. తమ కార్యకర్తల కళ త్వరలో నెరవేరబోతుందని ఉద్ఘాటించారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. గ్రామగ్రామాన కాషాయం జెండా ఎగరవేయాలని బీజేపీ శ్రేణులకు మార్గనిర్దేశం చేశారు. కాంగ్రెస్‌కి ఓట్లు వేసి ప్రజలు బాధపడుతున్నారని చెప్పుకొచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కుటుంబ పార్టీలని.. నల్లగొండలో ఆ రెండు పార్టీల్లోని కుటుంబాలే పరిపాలిస్తున్నాయని విమర్శించారు. మతపరమైన రిజర్వేషన్లను తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. బీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేస్తోందని ఆరోపించారు. ప్రజా వ్యతిరేక విధానాలపై బీజేపీ పోరాడుతోందని స్పష్టం చేశారు. తెలంగాణలో బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలనను చూశారని.. బీజేపీకి ఒక అవకాశం ఇవ్వాలని రామచందర్‌రావు కోరారు.
ఈ వార్తలు కూడా చదవండి
కేసీఆర్ చేసిన తప్పులను మాపై రుద్దుతున్నారు.. మల్లు భట్టి విక్రమార్క ఫైర్
కేసీఆర్‌తో హరీష్‌రావు కేటీఆర్ కీలక భేటీ.. ఎందుకంటే
Read Latest Telangana News And Telugu News