Share News

IPL 2026: ఆర్ఆర్ హెడ్ కోచ్‌గా సంగక్కర

ABN , Publish Date - Nov 17 , 2025 | 01:49 PM

ఐపీఎల్ 2026 ముందు రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ జట్టులో కీలక మార్పులు చేస్తోంది. తాజాగా శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కరను హెడ్ కోచ్‌గా నియమిస్తూ సోషల్ మీడియా వేదికగా అధికారికంగా ప్రకటించింది. రాహుల్ ద్రవిడ్ వైదొలగడంతో.. సంగక్కర ఆ స్థానాన్ని భర్తీ చేయనున్నాడు.

IPL 2026: ఆర్ఆర్ హెడ్ కోచ్‌గా సంగక్కర
Kumar Sangakkara

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026కు ముందు రాజస్థాన్ రాయల్స్ తమ కోచింగ్ స్టాఫ్‌లో కీలక మార్పులు చేసింది. ఆర్ఆర్ హెడ్ కోచ్‌గా శ్రీలంక క్రికెట్ దిగ్గజం కుమార సంగక్కర(Kumar Sangakkara)ను రాజస్థాన్ నియమించింది. దీంతో ప్రస్తుతం ఉన్న రాహుల్ ద్రవిడ్ స్థానాన్ని సంగక్కర భర్తీ చేయనున్నాడు.


హెడ్ కోచ్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్ డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా కూడా బాధ్యతలు చేపట్టనున్నాడు. సంగక్కర ఇదే ఫ్రాంచైజీకి 2021 నుంచి 2024 వరకు ఈ పదవుల్లోనే కొనసాగాడు. 2021లో రాజస్థాన్‌లో చేరిన సంగక్కర డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా కెరీర్ ప్రారంభించి కోచ్‌గా నియమితుడయ్యాడు. అతడి గైడెన్స్‌లో రాజస్థాన్ జట్టు నాలుగు సార్లు ప్లే ఆఫ్స్ వరకు వెళ్లింది. అయితే ఐపీఎల్‌-2025 సీజన్‌కు ముందు రాహుల్ ద్రవిడ్(Rahul Dravid) రాకతో సంగాను రాజస్థాన్ పక్కన పెట్టింది. ఇప్పుడు ద్రవిడ్ తన పదవి నుంచి వైదొలగడంతో సంగక్కర మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ విషయాన్ని ఆర్ఆర్ యాజమాన్యం సోషల్ మీడియా వేదికగా ధ్రువీకరిచింది. ఈ సందర్భంగా రాజ‌స్తాన్ రాయ‌ల్స్‌కు రెండో ఐపీఎల్ టైటిల్‌ను అందించేందుకు అన్ని విధాల ప్ర‌య‌త్నిస్తాను సంగక్కర పేర్కొన్నాడు.


కెప్టెన్ అతడేనా?

ఐపీఎల్ 2026 మెగా వేలానికి ముందు కెప్టెన్ సంజు శాంసన్‌(Sanju Samson) ట్రేడ్ చేసి సీఎస్కే స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను తీసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఈ సీజన్‌కు ముందు జట్టు తమ కొత్త సారథిని ప్రకటించాల్సి ఉంది. అయితే జడేజానే జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కెరీర్ చివరి దశలో ఉన్న జడేజా తన అనుభవాన్ని జోడించి జట్టుకు ఐపీఎల్ టైటిల్‌ను అందించడానికి కృషి చేస్తారని ఫ్రాంచైజీ ఆశిస్తోంది.


ఇవి కూడా చదవండి:

అతడిని జట్టులోకి తీసుకో: గంగూలీ

ఎక్కడో తప్పు జరుగుతోంది: పుజారా

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 17 , 2025 | 01:49 PM