Home » Ravindra Jadeja
ఐపీఎల్ 2026లో రాజస్థాన్ రాయల్స్ శుభారంభం చేసింది. 8 వికెట్ల తేడాతో సీఎస్కేపై ఘన విజయం సాధించింది. అయితే స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా.. చెన్నై సూపర్ కింగ్స్ నుంచి ట్రేడ్ డీల్ ద్వారా ఆర్ఆర్కు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో జడ్డూ బౌలింగ్‌లో దూబె ఔటయ్యాడు.
ఐపీఎల్ 2026లో భాగంగా నిన్న(సోమవారం) జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌పై రాజస్థాన్ రాయల్స్ 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. సీఎస్కే నుంచి రాజస్థాన్ జట్టులోకి వెళ్లిన స్టార్ ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అద్భుతంగా రాణించాడు.
క్రికెట్ అభిమానులు ఎప్పుడా ఎప్పుడా అని ఎదురుచూస్తోన్న ఐపీఎల్ మెగా టోర్నీ అతి త్వరలో ప్రారంభం కానుంది. జడేజాకు రాజస్థాన్ రాయల్స్ గ్రాండ్ వెల్కమ్ చెబుతూ ఓ వీడియోను పంచుకుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేస్తోంది.
టీమిండియా స్టార్ స్పిన్నర్ రవీంద్ర జడేజా వన్డేల్లో కొంతకాలంగా ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఈ నేపథ్యంలో జడేజా గురించి అతడి మాజీ సహచరుడు, టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవిచంద్రన్ అశ్విన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. బౌలింగ్ పరంగా జడ్డూకు పలు కీలక సూచనలు చేశాడు.
నేటి నుంచి న్యూజిలాండ్‌తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. తొలి మ్యాచ్ వడోదర వేదికగా ప్రారంభం కానుంది. అయితే ఈ సిరీస్‌కు భారత జట్టులో స్టార్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్‌ను సెలక్టర్లు ఎంపిక చేయలేదు. ఈ విషయంపై అక్షర్ స్పందించాడు.
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్‌ను రవీంద్ర జడేజా నడిపించడం ఖాయమైంది. ‘ఎక్స్’లో జడేజా ఫొటోను పంచుకున్న రాజస్థాన్ ఫ్రాంఛైజీ.. ‘దళపతి’ అనే వ్యాఖ్యను జోడించింది. గత సీజన్ వరకు రాజస్థాన్‌కు కెప్టెన్‌గా ఉన్న సంజు శాంసన్ చెన్నై సూపర్ కింగ్స్‌కు వెళ్లిపోయిన విషయం తెలిసిందే.
టీమిండియా టెస్ట్, వన్డే జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ జనవరిలో విజయ్ హజారే ట్రోఫీలో పాల్గొనే అవకాశముందని సమాచారం. జనవరి 11 నుంచి న్యూజిలాండ్‌తో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. అంతకంటే ముందే వీరు విజయ్ హజారేలో ఆడనున్నారని తెలుస్తోంది.
ఐపీఎల్ 2026 మినీ వేలంలో రవి బిష్ణోయ్‌ను రాజస్థాన్ రాయల్స్ రూ.7.20కోట్లకు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో అతడు తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. జడేజాతో కలిసి ఆడేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు.
గుజరాత్ మంత్రి, రవీంద్ర జడేజా భార్య రివాబా తాజాగా చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. తన భర్తకు ఎలాంటి చెడు అలవాట్లు లేవంటూనే మిగతా క్రికెటర్లు అలా కాదని ఆమె కామెంట్ చేయడంతో నెట్టింట పెద్ద చర్చ మొదలైంది.
గువాహటి టెస్టులో భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రికార్డు సృష్టించాడు. సౌతాఫ్రికాపై 50 వికెట్లు తీసుకున్న ఐదో బౌలర్‌గా ఘనత సాధించాడు.