Ravindra Jadeja: రికార్డు సృష్టించిన జడేజా
ABN , Publish Date - Nov 25 , 2025 | 04:12 PM
గువాహటి టెస్టులో భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా రికార్డు సృష్టించాడు. సౌతాఫ్రికాపై 50 వికెట్లు తీసుకున్న ఐదో బౌలర్‌గా ఘనత సాధించాడు.
ఇంటర్నెట్ డెస్క్: గువాహటి వేదికగా టీమిండియా-సౌతాఫ్రికా మధ్య రెండో టెస్టు కొనసాగుతోంది. ఇప్పటికే రెండో ఇన్నింగ్స్ ఆడిన సఫారీ సేన ఐదు వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసి డిక్లేర్ ఇచ్చింది. ఇందులో భారత స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీశాడు. ఈ క్రమంలో జడ్డూ(Ravindra Jadeja) రికార్డు సృష్టించాడు. టెస్టు క్రికెట్‌లో దక్షిణాఫ్రికాపై 50 వికెట్లు సాధించిన ఐదో భారత బౌలర్‌గా నిలిచాడు.
ఈ జాబితాలో జడేజా కంటే ముందు అనిల్ కుంబ్లే, జవగల్ శ్రీనాథ్, హర్భజన్ సింగ్, రవిచంద్రన్ అశ్విన్ ఉన్నారు. ప్రస్తుతం గువాహటిలో జరుగుతున్న టెస్ట్.. జడేజాకు సౌతాఫ్రికాతో 11వ మ్యాచ్. అతడు ఇప్పటి వరకు 19 ఇన్నింగ్స్‌ల్లో 50 వికెట్లు తీసుకున్నాడు. అయితే దక్షిణాఫ్రికాపై ఎక్కువ వికెట్లు తీసుకున్న భారత బౌలర్‌గా రికార్డు మాత్రం అనిల్ కుంబ్లే పేరు మీద ఉంది. అతడు 21 టెస్టు మ్యాచుల్లో 84 వికెట్లు తన సొంతం చేసుకున్నాడు.
మ్యాచ్ విషయానికొస్తే..
తొలి ఇన్నింగ్స్‌లో 489 పరుగుల చేసిన ప్రొటీస్ జట్టు ప్రస్తుతం టీమిండియాపై 549 పరుగుల భారీ ఆధిక్యాన్ని టీమిండియాకు నిర్దేశించింది. రెండో ఇన్నింగ్స్‌లో 260 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. బ్యాటింగ్‌కి దిగిన టీమిండియాకు ఆదిలోనే షాక్ తగిలింది. ఓపెనర్లు యశస్తి జైస్వాల్(13), కేఎల్ రాహుల్(6) ఔటయ్యారు. క్రీజులో కుల్దీప్ యాదవ్(4), సాయి సుదర్శన్(2) ఉన్నారు. టీమిండియా ఇంకా 522 పరుగులు వెనుకంజలో ఉంది.
ఇవి కూడా చదవండి:
సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549
మరోసారి ఆసుపత్రిలో చేరిన పలాశ్