Ind Vs SA: 508 పరుగుల ఆధిక్యంలో సౌతాఫ్రికా
ABN , Publish Date - Nov 25 , 2025 | 02:16 PM
గువాహటి వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో సఫారీ సేన చెలరేగుతోంది. నాలుగో రోజు ఆట ప్రారంభించిన ప్రొటీస్ జట్టు.. లంచ్ బ్రేక్ సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. టీమిండియాపై 508 పరుగుల భారీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తుంది.
ఇంటర్నెట్ డెస్క్: గువాహటి వేదికగా సౌతాఫ్రికా-టీమిండియా(Ind Vs SA) మధ్య రెండో టెస్టు కొనసాగుతోంది. ఓవర్ నైట్ 26/0 స్కోరు వద్ద నాలుగో రోజు ఆట ప్రారంభించిన ప్రొటీస్ జట్టు రెండో ఇన్నింగ్స్‌లో లంచ్ బ్రేక్ సమయానికి నాలుగు వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. మొత్తంగా టీమిండియాపై సౌతాఫ్రికా 508 పరుగుల భారీ ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. క్రీజులో స్టబ్స్(60), ముల్డర్(29) ఉన్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు 42 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
సౌతాఫ్రికా బ్యాటర్లలో టోనీ డీ జార్జి(49) హాఫ్ సెంచరీని తృటిలో మిస్ చేసుకున్నాడు. రవీంద్ర జడేజా బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. ఓపెనర్లు రెకెల్టన్(35), మార్క్‌రమ్(29) పర్వాలేదనిపించారు. సఫారీల కెప్టెన్ టెంబా బావుమా(3) నిరాశపర్చాడు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 3, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీసుకున్నారు. జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్ ప్రభావం చూపలేకపోయారు. వీరిద్దరూ కలిసి కేవలం 11 ఓవర్లు మాత్రమే బౌలింగ్ వేశారు. నితీశ్ కుమార్ రెడ్డికి బౌలింగ్ చేసే అవకాశమే రాలేదు. అనూహ్యంగా యశస్వి జైస్వాల్ లంచ్‌కు కాస్త ముందు ఒక ఓవర్ బౌలింగ్ వేశాడు.
ఇవి కూడా చదవండి:
Temba Bavuma: భారత్‌ను చిక్కుల్లో పెట్టేందుకు టెంబా బవుమా సరికొత్త వ్యూహం
Palak Muchhal: స్మృతి, పలాశ్‌ల పెళ్లిపై.. ముచ్చల్ సోదరి పలాక్ కీలక కామెంట్స్