Ind Vs SA: సౌతాఫ్రికా డిక్లేర్.. భారత్ టార్గెట్ 549
ABN , Publish Date - Nov 25 , 2025 | 03:06 PM
సౌతాఫ్రికా-టీమిండియా మధ్య గువాహటి వేదికగా రెండో టెస్టు కొనసాగుతోంది. నాలుగో రోజు బ్యాటింగ్ కొనసాగించిన సఫారీ సేన.. 260 పరుగుల వద్ద డిక్లేర్ ప్రకటించింది. టీమిండియా టార్గెట్ 549 పరుగులు.
ఇంటర్నెట్ డెస్క్: గువాహటి వేదికగా టీమిండియాతో జరుగుతున్న రెండో టెస్టులో సౌతాఫ్రికా ఆది నుంచి ఆధిపత్యం చెలాయిస్తూనే వస్తోంది. ఓవర్ నైట్ 26/0 స్కోరుతో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన సఫారీ సేన.. 260 పరుగులు చేసి డిక్లేర్ ప్రకటించింది. దీంతో టీమిండియాపై 548 పరుగుల ఆధిక్యంలో ఉంది. భారత్ ఈ మ్యాచ్‌లో గెలవాలంటే 549 పరుగులు చేయాలి.
వన్ డౌన్ బ్యాటర్ స్టబ్స్(94) ఔట్ అవ్వగానే సౌతాఫ్రికా డిక్లేర్ చేసింది. టోనీ డీ జార్జి(49) తృటిలో అర్థ శతకం చేజార్చుకున్నాడు. రెకెల్టన్(35), మార్క్‌రమ్(29) పర్వాలేదనిపించారు. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా 489 పరుగుల భారీ స్కోరు చేయగా.. టీమిండియా 201 పరుగులకే కుప్పకూలిన సంగతి తెలిసిందే. రెండో ఇన్నింగ్స్‌లో భారత బౌలర్లలో రవీంద్ర జడేజా 4, వాషింగ్టన్ సుందర్ 1 వికెట్ తీశారు.
ఇవి కూడా చదవండి:
Temba Bavuma: భారత్‌ను చిక్కుల్లో పెట్టేందుకు టెంబా బవుమా సరికొత్త వ్యూహం
Palak Muchhal: స్మృతి, పలాశ్‌ల పెళ్లిపై.. ముచ్చల్ సోదరి పలాక్ కీలక కామెంట్స్