Share News

Palash: మరోసారి ఆసుపత్రిలో చేరిన పలాశ్

ABN , Publish Date - Nov 25 , 2025 | 02:47 PM

భారత స్టార్ మహిళా బ్యాటర్ స్మృతి మంధాన పెళ్లి వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఆమె తండ్రి అకస్మాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. మరోవైపు పలాశ్ కూడా అస్వస్థతకు గురయ్యాడు. చికిత్స అనంతరం డిశ్చార్జి కాగా మంగళవారం మళ్లీ ఆసుపత్రిలో చేరాడు.

Palash: మరోసారి ఆసుపత్రిలో చేరిన పలాశ్
Palash

ఇంటర్నెట్ డెస్క్: భారత స్టార్ మహిళా క్రికెటర్ స్మృతి మంధాన(Smriti Mandhana) పెళ్లి వాయిదా పడిన సంగతి తెలిసిందే. స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు స్మృతి కాబోయే భర్త పలాశ్ ముచ్చల్(Palash Muchhal) కూడా వైరల్ ఇన్ఫెక్షన్, ఎసిడిటీ వల్ల ఇబ్బంది పడటంతో అతడిని ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం డిశ్చార్జి అయ్యారు. అయితే మంగళవారం మరోసారి పలాశ్ అస్వస్థతకు గురవ్వడంతో ముంబైలోని ఎస్‌వీఆర్ ఆసుపత్రికి తరలించారు.


ఏడూస్తూనే ఉన్నాడు..

ఫొటో షూట్‌ల కోసం వరుస ప్రయాణాలు, కొన్ని రోజులుగా సంగీత్.. డ్యాన్స్‌లు, సరైన నిద్ర లేమి, ఇతర కారణాల వల్ల పలాశ్ ఒత్తిడికి లోనై అస్వస్థతకు గురైనట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలాశ్ తల్లి ఈ విషయం గురించి స్పందించారు. ‘స్మృతి తండ్రికి, పలాశ్‌కు మధ్య మంచి అనుబంధం ఉంది. ఆదివారం ఆయన హఠాత్తుగా అనారోగ్యానికి గురవ్వడంతో పలాశ్ తట్టుకోలేకపోయాడు. ఆ వార్త విని నాలుగు గంటల పాటు ఏడుస్తూనే ఉన్నాడు. అందువల్లే పలాశ్ ఆరోగ్యం కూడా క్షీణించింది. స్మృతి కంటే ముందే పెళ్లి వాయిదా నిర్ణయం పలాశ్ తీసుకున్నాడు. అందుకే పెళ్లి వాయిదా వేయాల్సి వచ్చింది’ అని ఆమె తెలిపారు.


స్మృతి-పలాశ్ వివాహం నవంబర్ 23న బెంగళూరు వేదికగా జరగాల్సి ఉంది. అయితే వివాహ వేడుకల్లో పాల్గొంటుండగా స్మృతి తండ్రి అనారోగ్యానికి గురయ్యాడు. వెంటనే అతడిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇదిలా ఉండగా.. పలాశ్ కూడా వైరల్ ఇన్ఫెక్షన్, ఎసిడిటీతో ఆసుపత్రిలో చేరి డిశ్చార్జ్ అయ్యారు. మంగళవారం మరోసారి అస్వస్థతకు గురయ్యాడు.


ఇవి కూడా చదవండి:

Temba Bavuma: భారత్‌ను చిక్కుల్లో పెట్టేందుకు టెంబా బవుమా సరికొత్త వ్యూహం

Palak Muchhal: స్మృతి, పలాశ్‌ల పెళ్లిపై.. ముచ్చల్ సోదరి పలాక్ కీలక కామెంట్స్

Updated Date - Nov 25 , 2025 | 05:11 PM