IPL 2026: సంజూని తీసుకోవడం పిచ్చి నిర్ణయం: మాజీ క్రికెటర్
ABN , Publish Date - Nov 13 , 2025 | 07:03 AM
ఐపీఎల్ 2026లో రవీంద్ర జడేజా స్థానంలో సంజూ శాంసన్‌ను తీసుకోవడం సీఎస్కే పొరపాటు నిర్ణయమని మాజీ క్రికెటర్ సదగోపన్ రమేశ్ వ్యాఖ్యానించారు. సంజూని తీసుకోవడం వల్ల చెన్నై జట్టు బలహీనపడుతుందని అభిప్రాయపడ్డాడు.
ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026 నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్(CSK) జట్టు స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను వదులుకుంటున్న విషయం తెలిసిందే. ట్రేడ్ డీల్ ద్వారా జడేజాతో పాటు సామ్ కరన్‌ను కూడా వదులుకొని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్‌ను జట్టులోకి తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ డీల్‌పై అధికార ప్రకటన రాకపోయినప్పటికీ.. దాదాపు ఈ ప్రక్రియ పూర్తయినట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయాన్ని భారత మాజీ క్రికెటర్ సదగోపన్ రమేశ్ తప్పుబట్టాడు.
‘చెపాక్‌లో సంజూ శాంసన్(Sanju Samson)కు పెద్దగా రికార్డులు ఏమీ లేవు. అక్కడ అతడు కొన్ని మ్యాచ్‌లు మాత్రమే ఆడాడు. సంజూ టర్నింగ్ ట్రాక్‌పై రాణించలేడనే వాదన కూడా ఉంది. ఇటీవల కాలంలో సంజూ ఫామ్‌లో కూడా లేడు. జడేజా(Ravindra Jadeja) టర్నింగ్ ట్రాక్‌పై అద్భుతంగా రాణిస్తాడు. జడేజాను వదిలేస్తే సీఎస్కే కచ్చితంగా బలహీనపడుతుంది. అయితే సంజూని తీసుకోవడం వల్ల చెన్నై బలపడుతుందనే దానికి స్పష్టత లేదు. మరోవైపు రాజస్థాన్ రాయల్స్ ఫ్లాట్ వికెట్లపై జడేజాకు సవాలే ఎదురు కానుంది. జడేజా చెపాక్ మైదానంలో ఎన్నో మ్యాచ్‌లు గెలిపించాడు. కీలక సమయంలో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అతడిని ఉన్న ఫిట్‌నెస్‌తో మరో మూడేళ్లు సులువుగా ఐపీఎల్ ఆడగలడు’ అని సదగోపన్ చెప్పుకొచ్చాడు.
ఈ స్వాప్ డీల్ ఏంటి?
సంజూ శాంసన్, రవీంద్ర జడేజా ఐపీఎల్ వేతనం రూ.18కోట్లు. కాబట్టి ఈ ఇద్దరి స్వాప్ డీల్ సులువుగా పూర్తయింది. సామ్ కరన్ ధర రూ.2.40కోట్లు. ఇప్పుడు సీఎస్కే ఇతడిని కూడా వదులుకుంటుంది కాబట్టి ఆ డబ్బును రాజస్థాన్ రాయల్స్ నుంచి కట్ చేసి.. సీఎస్కే పర్సులో కలుపుతారు. ప్రస్తుతం రాజస్థాన్ రాయల్స్ ఓవర్‌సీస్ ప్లేయర్ల కోటా ఎక్కువగా ఉందని.. దీంతో ఈ స్వాప్ డీల్‌పై అధికారిక ప్రకటన ఆలస్యం అయినట్లు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి
ఐపీఎల్ వేలం.. ఎప్పుడు, ఎక్కడ జరగనుందంటే..
అందుకే పాక్ ఆటగాళ్లతో కరచాలనం చేయలేదు: సూర్యకుమార్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి