Share News

IPL 2026: సీఎస్కే కెప్టెన్ ఎవరంటే?

ABN , Publish Date - Nov 15 , 2025 | 07:11 PM

ట్రేడ్ డీల్ ద్వారా సీఎస్కే జట్టు జడేజాను వదులుకొని సంజూ శాంసన్‌ను తీసుకున్న విషయం తెలిసిందే. చెన్నై జట్టు తదుపరి కెప్టెన్ సంజూనే అని వస్తున్న వార్తలపై సీఎస్కే క్లారిటీ ఇచ్చింది.

IPL 2026: సీఎస్కే కెప్టెన్ ఎవరంటే?
IPL 2026

ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2026.. సీజన్ మొదలుకాక ముందే హడావిడి మొదలైంది. నేటితో(శనివారం) ఆటగాళ్ల రిటెన్షన్ గడువు ముగియనుంది. ఇప్పటికే పలు ఫ్రాంచైజీలు తమ రిటైన్, రిలీజ్ ఆటగాళ్ల లిస్ట్‌ను ప్రకటించాయి. దీంట్లో ముఖ్యంగా సీఎస్కే స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాను వదులుకోవడంపై తీవ్ర చర్చ నడుస్తుంది. జడేజాతో పాటు సామ్ కరన్‌ను వదలి సంజూ శాంసన్‌తో ట్రేడ్ చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అందరి మదిలో ఒకటే ప్రశ్న.. సీఎస్కే తదుపరి కెప్టెన్ ఎవరు?


రుతురాజ్? సంజూ?

చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ సీజన్‌లో 11 మంది ప్లేయర్స్‌ను రిలీజ్ చేసింది. రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన సంజూ శాంసన్‌(Sanju Samson)ను రూ.18కోట్లకు ట్రేడ్ చేసింది. ఈ నేపథ్యంలో సీఎస్కే కెప్టెన్సీ కూడా సంజూకే ఇస్తారన్న ప్రచారమూ జోరుగా సాగింది. గత సీజన్‌లో గాయం బారిన పడి రుతురాజ్ గైక్వాడ్(Ruturaj Gaikwad) టోర్నీ మధ్యలోనే నిష్క్రమించిన సంగతి తెలిసిందే. అతడు లేకపోవడంతో కెప్టెన్సీ బాధ్యతను ధోనీ తీసుకోవాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో సంజూనే కెప్టెన్ అనే వార్తలకు బలం చేకూరింది.


కెప్టెన్ రుతురాజ్..

రిటెన్షన్స్ హడావిడి నేపథ్యంలో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఈ వార్తలపై ఓ క్లారిటీ ఇచ్చింది. సోషల్ మీడియాలో వస్తోన్న వార్తలన్నింటినీ కొట్టిపారేస్తూ రుతురాజ్ గైక్వాడే సీఎస్కే(CSK) కెప్టెన్ అని చెన్నై సూపర్ కింగ్స్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది. దీంతో సంజూ శాంసన్ కెప్టెన్ కాదని అధికారికంగా వెల్లడైంది. మరోవైపు జడేజా, సామ్ కరన్‌లను వదులుకోవడంపై సీఎస్కే సీఈవో కాశీ విశ్వనాథన్ స్పందించిన విషం తెలిసిందే.


ఇవి కూడా చదవండి:

రెండో రోజు ముగిసిన ఆట

సీఎస్కేకి వెళ్లడంపై స్పందించిన సంజూ

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 15 , 2025 | 07:11 PM