Share News

Ind vs SA: రెండో రోజు ముగిసిన ఆట

ABN , Publish Date - Nov 15 , 2025 | 05:23 PM

ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సఫారీ సేన ఏడు వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా నాలుగు వికెట్లు తీసి సత్తా చాటాడు.

Ind vs SA: రెండో రోజు ముగిసిన ఆట
Ind vs SA

ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-సౌతాఫ్రికా జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా కొనసాగుతోంది. బ్యాటింగ్‌లో నిరాశపర్చిన టీమిండియా(Team India).. బౌలింగ్‌లో అదరగొడుతుంది. భారత స్నిన్నర్ల ధాటికి సఫారీ సేన బ్యాటర్లు వరుసగా పెవిలియన్ బాట పట్టారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా ఏడు వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. దీంతో భారత్‌పై 63 పరుగుల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. కోర్బిన్ బాష్(1), టెంబా బావుమా(29) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(Jadeja) విజృంభించాడు. ఏకంగా నాలుగు వికెట్లు తీసుకొని 28 పరుగుల మాత్రమే ఇచ్చాడు. కుల్దీప్ యాదవ్ 2, అక్షర్ పటేల్ ఓ వికెట్ పడగొట్టారు.


ఓవర్‌నైట్ 37/1తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా ఘోరంగా విఫలమైంది. సఫారీ బౌలర్ల ధాటికి బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో 189 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్(39) టాప్ స్కోరర్. వాషింగ్టన్ సుందర్(29), రిషభ్ పంత్(27), రవీంద్ర జడేజా(27) పర్వాలేదనిపించారు. బ్యాటింగ్ చేస్తుండగా మెడ పట్టేయడంతో కెప్టెన్ శుభ్‌మన్ గిల్(4*) రిటైర్డ్ హర్ట్‌గా మైదానాన్ని వీడాడు. సౌతాఫ్రికా బౌలర్లలో సైమన్ హర్మర్(4/30), మార్కో యాన్సెన్(3/35) రాణించారు. దీంతో భారత్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 30 పరుగుల ఆధిక్యం లభించింది.


ఇవి కూడా చదవండి:

క్రికెట్‌లోకి సచిన్‌ అరంగేట్రం ఈరోజే!

అది మాకు కఠినమైన నిర్ణయమే: సీఎస్కే సీఈవో

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 15 , 2025 | 05:23 PM