Sachin Tendulkar: క్రికెట్‌లోకి సచిన్ అరంగేట్రం ఈరోజే!
ABN , Publish Date - Nov 15 , 2025 | 03:32 PM
నవంబర్ 15, 1989లో 16 ఏళ్ల వయసులో క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేశాడు. 2013లో ఇదే రోజున ఆయన చివరి మ్యాచ్ ఆడటం విశేషం.
ఇంటర్నెట్ డెస్క్: నవంబర్ 15, 1989.. ఓ 16 ఏళ్ల బాలుడు అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. తొలి మ్యాచ్‌లోనే ప్రత్యర్థి పాకిస్తాన్. మ్యాచ్ వేదిక.. కరాచీ. మైదానంలోకి బ్యాట్ పట్టుకుని బరిలోకి దిగిన ఆ బాలుడు చేసింది 15 పరుగులే.. కానీ! క్రికెట్‌ను శాసించే రాజు అవుతాడని ఆనాడు ఎవ్వరూ ఊహించలేదు. అప్పటి నుంచి మళ్లీ ఆ బాలుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. రికార్డులు బద్దలు కొట్టాలన్నా.. రికార్డులు తిరిగి రాయాలన్నా.. అతడికి వెన్నతో పెట్టిన విద్య! అతడెవరో ఇప్పటికే అర్థమై ఉంటుంది కదా.. అతడే ది గ్రేట్ సచిన్ రమేశ్ టెండూల్కర్.
వీడ్కోలు కూడా..
సచిన్(Sachin Tendulkar) అరంగేట్రం, వీడ్కోలు మ్యాచ్ రెండూ ఈ రోజునే కావడం విశేషం. నవంబర్ 15, 2013న వాంఖడే స్టేడియం వేదికగా వెస్టిండీస్‌తో జరిగిన రెండో టెస్టులో ఆడాడు. ఈ మ్యాచ్ నవంబర్ 14 నుంచి 16 వరకు సాగింది. సచిన్ చివరిసారిగా బ్యాటింగ్ మాత్రం నవంబర్ 15న చేశాడు. ఈ మ్యాచ్‌లో అతడు 118 బంతుల్లో 74 పరుగులు సాధించాడు. ఇదే అతడికి ఆఖరు అంతర్జాతీయ మ్యాచ్. ఈ టెస్ట్‌లో టీమిండియా(Team India) 126 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ విషయాన్ని బీసీసీఐ(BCCI) సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
రికార్డులివే..
సచిన్ టెండూల్కర్ తన కెరీర్‌లో 200 టెస్టులు ఆడి 15,921 పరుగులు చేశాడు. ఇందులో 51 సెంచరీలు, 68 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 463 వన్డేలు ఆడి 18,426 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో 49 సెంచరీలు, 96 హాఫ్ సెంచరీలు చేశాడు. కాగా సచిన్.. ఒకే ఒక అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడాడు.
ఇవి కూడా చదవండి:
టీమిండియా ఆలౌట్.. ఆధిక్యం ఎంతంటే?
టీమిండియాకు బిగ్ షాక్.. శుభ్‌మన్ గిల్‌కు గాయం!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి