IND vs SA Test: టీమిండియా ఆలౌట్.. ఆధిక్యం ఎంతంటే?
ABN , Publish Date - Nov 15 , 2025 | 02:26 PM
సౌతాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ప్రొటీస్ బౌలర్ల ముందు టీమిండియా బ్యాటర్లు చేతులెత్తేశారు. దీంతో 189 పరుగులకే భారత్ ఆలౌటైంది.
దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత్ తొలి ఇన్నింగ్స్(IND vs SA Test 2025)లో 189 పరుగులకు ఆలౌటైంది. దీంతో 30 పరుగుల స్వల్ప ఆధిక్యాన్ని అందుకుంది. సౌతాఫ్రికా బ్యాటర్లే కాకుండా టీమిండియా ప్లేయర్లు కూడా బ్యాటింగ్ లో చేతులెత్తేశారు. కేఎల్ రాహుల్( KL Rahul )(39), వాషింగ్టన్ సుందర్(29) టాప్ స్కోరర్లుగా నిలిచారు. రిషభ్ పంత్( 27), రవీంద్ర జడేజా( 27) పర్వలేదనిపించారు. దక్షిణాఫ్రికా బౌలర్లలో సిమన్ హర్మర్(Simon Harmer) 4, మార్కో జాన్సెన్3 తీసి.. భారత్ పతనాన్ని శాసించారు. అలానే కేశవ్ మహరాజ్, కోర్బిన్ బోష్ చెరో వికెట్ పడగొట్టారు.
37/1 ఓవర్‌నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన భారత్(Team India)కు ఆశించిన ఆరంభం దక్కలేదు. బ్యాటింగ్‌కు ప్రతికూలంగా ఉన్న పిచ్ పై ఓవర్‌నైట్ బ్యాటర్లు కేఎల్ రాహుల్(39), వాషింగ్టన్ సుందర్(29) ఆచితూచి ఆడారు. రాహుల్ అయితే తన జిడ్డు బ్యాటింగ్‌తో సఫారీ బౌలర్లను విసిగించాడు. కాసేపటికి గేర్ మార్చిన సుందర్.. ఓ సిక్స్, రెండు బౌండరీలతో ఎదురు దాడికి దిగాడు. అయితే సిమన్ హర్మర్.. సుందర్ ను క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 57 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది.
ఆ కాసేపటికే మెడ నొప్పి కారణంగా గిల్ రిటైర్డ్ హర్ట్(Shubman Gill retired hurt)గా వెనుదిరిగాడు. ఆచితూచి ఆడిన కేఎల్ రాహుల్ కూడా కేశవ్ మహరాజ్ ఔటయ్యాడు. ఆ తర్వాత క్రమం తప్పకుండా భారత్ వికెట్లు కోల్పోయింది. చివరకు 189 పరుగులకు టీమిండియా ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ లో ప్రొటీస్ జట్టు 159 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా స్టార పేసర్ జస్ ప్రీత్ బుమ్రా 5 వికెట్లు పడగొట్టి.. సౌతాఫ్రికా పతనంలో కీలక భూమిక పోషించాడు.
ఇవి కూడా చదవండి:
Virat Kohli 50th ODI Century: నేడు విరాట్‌కి ప్రత్యేకమైన రోజు.. బీసీసీఐ ప్రత్యేక పోస్టు!
మరో రికార్డుపై కన్నేసిన కేఎల్ రాహుల్..!
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి