Share News

Rishabh Pant: సెహ్వాగ్ రికార్డు బ్రేక్!

ABN , Publish Date - Nov 15 , 2025 | 04:28 PM

దాదాపు నాలుగు నెలల తర్వాత గాయం నుంచి కోలుకున్న రిషభ్ పంత్ సౌతాఫ్రికాతో టెస్ట్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టాడు.

Rishabh Pant: సెహ్వాగ్ రికార్డు బ్రేక్!
Rishabh Pant

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ రిషభ్ పంత్.. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్‌లో తీవ్రంగా గాయపడిన విషయం తెలిసిందే. దాదాపు నాలుగు నెలల తర్వాత గాయం నుంచి కోలుకుని ప్రస్తుతం సౌతాఫ్రికాతో జరుగుతున్న టెస్టు సిరీస్‌లోకి రీఎంట్రీ ఇచ్చాడు. బ్యాటింగ్‌కి దిగినప్పటి నుంచి దూకుడు ప్రదర్శించిన పంత్ ఓ రికార్డును బద్దలు కొట్టాడు.


సో స్పెషల్..

కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా సౌతాఫ్రికాతో టీమిండియా తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతోంది. ఈ క్రమంలో పంత్(Rishabh Pant).. బ్యాటింగ్‌కి వచ్చి క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్(Sehwag) రికార్డును బ్రేక్ చేశాడు. టెస్ట్ మ్యాచ్‌లో అత్యధిక సిక్స్‌లు భారత ఆటగాడిగా పంత్ రికార్డు సృష్టించాడు. సౌతాఫ్రికాతో ఇన్నింగ్స్‌లో 24 బంతులు ఎదుర్కొన్న పంత్.. 27 పరుగులు చేశాడు. ఇందులో రెండు ఫోర్లు, రెండు సిక్స్‌లు ఉన్నాయి. టెస్ట్ క్రికెట్‌లో వీరేంద్ర సెహ్వాగ్ 180 ఇన్నింగ్స్‌లో మొత్తం 91 సిక్స్‌లు కొట్టాడు. కాగా పంత్ 83 ఇన్నింగ్స్‌లోనే 92 సిక్స్‌లు బాది ఈ ఫీట్‌ను అందుకున్నాడు. ఆ తర్వాతి స్థానాల్లో రోహిత్ శర్మ(116 ఇన్నింగ్స్‌లో 88 సిక్స్‌లు), రవీంద్ర జడేజా(130 ఇన్నింగ్స్‌లో 80 సిక్స్‌లు), ధోనీ(144 ఇన్నింగ్స్‌లో 78 సిక్స్‌లు) ఉన్నారు.


నలుపు, తెలుపు.. ఏంటవి?

కాలుకి తీవ్రమైన గాయం కావడంతో పంత్ నాలుగు నెలల పాటు ఆటకు దూరమై.. సౌతాఫ్రికాతో టెస్ట్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగిన తర్వాత పంత్ బ్యాటింగ్‌కి దిగాడు. ఈ నేపథ్యంలో అందరి దృష్టి అతడు వేసుకున్న ప్యాడ్లపై పడింది. పంత్ రెండు వేర్వేరు డిజైన్లలో ఉన్న ప్యాడ్లను ధరించడంపై అభిమానులు తీవ్రంగా చర్చిస్తున్నారు. గాయపడిన కాలుకు ఉన్న ప్యాడ్ ముందు భాగంలో నలుపు రంగు, వేరే కాలిది పూర్తిగా తెలుపు రంగులో ఉన్నాయి. అయితే ఇది గాయం నుంచి కోలుకున్న కాలికి మరింత సపోర్ట్ ఇచ్చేందుకు ప్రత్యేకంగా తయారు చేసిన ప్యాడ్ అయి ఉండొచ్చని అభిమానులు భావిస్తున్నారు.


ఇవి కూడా చదవండి:

క్రికెట్‌లోకి సచిన్‌ అరంగేట్రం ఈరోజే!

అది మాకు కఠినమైన నిర్ణయమే: సీఎస్కే సీఈవో

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 15 , 2025 | 04:28 PM