Share News

Rivaba Jadeja: టీమిండియా క్రికెటర్ సతీమణికి మంత్రి పదవి

ABN , Publish Date - Oct 17 , 2025 | 02:30 PM

టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్ సాధించిన అనేక విజయాల్లో జడేజా కీలక పాత్ర పోషించారు. ఇక ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే.. తాజాగా జడేజా సతీమణి రివాబా జడేజాకు మంత్రి పదవి దక్కింది.

Rivaba Jadeja: టీమిండియా క్రికెటర్ సతీమణికి మంత్రి పదవి
Ravindra Jadeja

ఎంతో మంది సినీ, క్రీడా రంగానికి చెందిన వారు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తుంటారు. కొన్ని సందర్భాల్లో వారి కుటుంబ సభ్యులు కూడా ఎన్నికల్లో పోటీ చేస్తుంటారు. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలు మంత్రులుగా కూడా అవకాశం సంపాదించారు. తాజాగా టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ భార్యకు మంత్రి పదవి దక్కింది. మరి.. ఆ స్టార్ క్రికెటర్ ఎవరు, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..


టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. భారత్ సాధించిన అనేక విజయాల్లో జడేజా కీలక పాత్ర పోషించారు. ఇక ఆయన వ్యక్తిగత విషయానికి వస్తే..తాజాగా జడేజా సతీమణి రివాబా జడేజాకు(Ravindra Jadeja Wife) మంత్రి పదవి దక్కింది. గుజరాత్ లో 26 మందితో కూడిన కొంత మంత్రి వర్గాన్ని ఆ రాష్ట్ర సీఎం భూపేంద్ర పటేల్ శుక్రవారం ప్రకటించారు. దీంతో జడేజా సతీమణి రివాబా జడేకు(Rivaba Jadeja) తొలిసారి మంత్రి పదవి దక్కింది.


2019 మార్చిలో బీజేపీలో చేరిన రివాబా జడేజా.. 2022 గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో జామ్‌నగర్ నార్త్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. రివాబా జడేజాకు(Ravindra Jadeja Wife) వ్యతిరేకంగా రవీంద్ర జడేజా సోదరి నైనబా జడేజా, తండ్రి అనిరుద్ద్ సిన్హ్ జడేజా ప్రచారం చేశారు. రవీంద్ర జడేజా కుటుంబం ఎన్నో తరాలుగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు దారులుగా ఉన్నారు. అయినా వారి వ్యతిరేకతను తట్టుకుని రివాబా 15 వేల మెజార్టీతో విజయం సాధించారు. గురువారం గుజరాత్ సీఎం (Gujarat CM)మినహా మంత్రులంతా రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. రాజీనామా చేసిన మంత్రుల నుంచి ఆరుగురు మాత్రమే తమ పదవులను నిలబెట్టుకున్నారు. హోమ్ మినిస్టర్ హర్ష్ సంఘవి ఉపముఖ్యమంత్రిగా నియమితులయ్యారు. కొత్త మంత్రులు శుక్రవారం ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.


ఇవి కూడా చదవండి

ఇలా అనడం సిగ్గు చేటు.. మాజీ క్రికెటర్‌పై మండిపడ్డ గౌతమ్ గంభీర్

Vaibhav Suryavanshi: వైభవ్‌ మరో చరిత్ర

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Oct 17 , 2025 | 04:34 PM