Manchester Test: సుందర్, జడేజా హాఫ్ సెంచరీలు.. ఆధిక్యంలో టీమిండియా..
ABN , Publish Date - Jul 27 , 2025 | 09:34 PM
టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సెంచరీకి తోడు మిడిలార్డర్ బ్యాటర్లు వాషింగ్టన్ సుందర్ (71 నాటౌట్), రవీంద్ర జడేజా (81 నాటౌట్) అర్ధశతకాలు సాధించడంతో టీమిండియా కోలుకుంది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా మాంఛెస్టర్‌లో జరుగుతున్న నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు అద్భుతంగా పుంజుకున్నారు

టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (Shubhman Gill) సెంచరీకి తోడు మిడిలార్డర్ బ్యాటర్లు వాషింగ్టన్ సుందర్ (81 నాటౌట్), రవీంద్ర జడేజా (76 నాటౌట్) అర్ధశతకాలు సాధించడంతో టీమిండియా కోలుకుంది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా మాంఛెస్టర్‌లో జరుగుతున్న నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు అద్భుతంగా పుంజుకున్నారు (Eng vs Ind). 228 బంతుల్లో సెంచరీ చేసిన గిల్ అసలు సిసలైన టెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు. సున్నా పరుగులకే రెండు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌ను కేఎల్ రాహుల్ (90)తో కలిసి గిల్ ఆదుకున్నాడు. నాలుగో రోజు మరో వికెట్ పడకుండా ఈ ఇద్దరూ అడ్డుకున్నారు (Shubhman Gill Century).
ఐదో రోజు కేఎల్ రాహుల్ త్వరగానే ఔటయ్యాడు. కెప్టెన్ గిల్ సెంచరీ చేసి పెవిలియన్ చేరాడు. గిల్ ఔట్ కావడంతో భారత శిబిరంలో ఆందోళన మొదలైంది. అయితే వాషింగ్టన్ సుందర్, జడేజా జోడీ ప్రత్యర్థి బౌలర్లకు ఎలాంటి అవకాశమూ ఇవ్వకుండా అద్భుతంగా ఆడుతున్నారు. వీరిద్దరూ ఐదో వికెట్‌కు అజేయంగా 141 పరుగులు జోడించారు. వీరి ప్రదర్శనతో టీమిండియా ఈ నాలుగో టెస్ట్‌ను సులభంగానే డ్రా చేసుకునేలా కనిపిస్తోంది.
ప్రస్తుతానికి టీమిండియా 131 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 361 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (81 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (71 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతానికి భారత్ 50 పరుగుల ఆధిక్యంలో ఉంది. గాయంతో బాధపడుతున్న రిషభ్ పంత్ కూడా ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌కు దిగబోతున్నాడు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌ను భారత్ డ్రా చేసుకునేలాగానే కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి..
మాంచెస్టర్ టెస్ట్‌లో భారత్ పోరాటం..ధైర్యంగా నిలిచిన శుభ్‌మాన్ గిల్, కేఎల్ రాహుల్
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..