Home » India Vs England
ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరగాల్సిన చివరి మ్యాచ్ లండన్‌లోని ఓవల్ మైదానంలో గురువారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. గంభీర్ దగ్గరుండి శిక్షణను పర్యవేక్షిస్తున్నాడు.
టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సెంచరీకి తోడు మిడిలార్డర్ బ్యాటర్లు వాషింగ్టన్ సుందర్ (71 నాటౌట్), రవీంద్ర జడేజా (81 నాటౌట్) అర్ధశతకాలు సాధించడంతో టీమిండియా కోలుకుంది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా మాంఛెస్టర్‌లో జరుగుతున్న నాలుగో టెస్ట్ రెండో ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటర్లు అద్భుతంగా పుంజుకున్నారు
ఇంగ్లండ్‌తో నాలుగో టెస్ట్ తొలిరోజును భారత్ మెరుగ్గా ముగించింది. బుధవారం మొదలైన ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 83 ఓవర్లలో 264/4 స్కోరు చేసింది.
ఐదో రోజు ఆర్చర్ తీసిన ఆ రెండు వికెట్లే భారత పరాజయాన్ని శాసించాయి. అయితే జోఫ్రా ఆర్చర్ అద్భుత ప్రదర్శన వెనుక 2002 నాటి గంగూలీ ఐకానిక్ వేడుక స్ఫూర్తిగా పని చేసిందట. ఈ విషయాన్ని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చెప్పాడు.
లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. కాగా, తాజా మ్యాచ్‌లో అంపైర్ పౌల్ రఫెల్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా ఉంది.
ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్‌పై సాధికారక విజయాన్ని నమోదు చేసింది. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌పై టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా నిలిచింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌లోనూ రాణించి ఇంగ్లండ్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది.
భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ త్వరలో మొదలవనుంది. రెండు హేమాహేమీ జట్ల మధ్య జరిగే ఈ పోరును చూడాలని అభిమానులు ఎంతో ఉత్సుకతతో ఉన్నారు. ఈ తరుణంలో ఈ సిరీస్ లైవ్ స్ట్రీమింగ్‌పై అప్‌డేట్ వచ్చేసింది.
భారత సీనియర్ జట్టుకే కాదు.. జూనియర్ టీమ్స్‌కు ఎంపిక అవడం కూడా అంత సులువు కాదు. భారీ పోటీని తట్టుకొని నిలకడగా రాణిస్తూ పోతే తప్ప సెలెక్ట్ అవ్వలేరు. కానీ ఓ ట్రక్ డ్రైవర్ కొడుకు అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.
భారత క్రికెట్‌కు మున్ముందు కఠిన సవాళ్లు ఎదురవనున్నాయి. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ లాంటి ముగ్గురు దిగ్గజాలు వీడ్కోలు చెప్పడంతో టెస్టుల్లో ఇకపై టీమిండియా ఎలా ఆడుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌తో భారత యువ జట్టు భవిష్యత్తు ఎలా ఉండబోతుందో తేలిపోనుంది.
ICC Champions Trophy 2025: టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్ కొత్త మిషన్ మొదలుపెట్టేశాడు. అందరూ ఇతర పనుల్లో బిజీ అయిపోతే.. అతడు మాత్రం సరికొత్త సవాల్‌కు సిద్ధమవుతున్నాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం..