Share News

Ind vs Eng: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఇంగ్లండ్‌పై ఘన విజయం..

ABN , Publish Date - Jul 06 , 2025 | 09:46 PM

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఇంగ్లండ్‌పై సాధికారక విజయాన్ని నమోదు చేసింది. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌పై టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా నిలిచింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌‌లోనూ రాణించి ఇంగ్లండ్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది.

Ind vs Eng: చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఇంగ్లండ్‌పై ఘన విజయం..
TeamIndia won by 336 runs against England

ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగిన రెండో టెస్ట్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది (Ind vs Eng). ఇంగ్లండ్‌పై సాధికారక విజయాన్ని నమోదు చేసింది. ఎడ్జ్‌బాస్టన్‌లో ఇంగ్లండ్‌పై టెస్ట్ మ్యాచ్ గెలిచిన తొలి ఆసియా జట్టుగా నిలిచింది. అటు బ్యాటింగ్‌లోనూ, ఇటు బౌలింగ్‌‌లోనూ రాణించి ఇంగ్లండ్‌పై సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించింది. తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ ఆరు వికెట్లు, రెండో ఇన్నింగ్స్‌లో ఆకాష్ దీప్ ఆరు వికెట్లు తీసి ఇంగ్లండ్ వెన్ను విరిచారు. దీంతో టీమిండియా 336 పరుగుల భారీ తేడాతో ఇంగ్లండ్‌పై గెలుపొందింది.


శనివారమే మూడు వికెట్లు కోల్పోయిన ఇంగ్లండ్ ఐదో రోజు లంచ్ సమయానికి మరో మూడు వికెట్లు కోల్పోయింది. 83 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన ఇంగ్లండ్‌ను జేమీ స్మిత్ (44 నాటౌట్), బెన్ స్టోక్స్ (33) ఆదుకున్నారు. ఆరో వికెట్‌కు 70 పరుగులు జోడించారు. అయితే ఈ జోడీని వాషింగ్టన్ సుందర్ విడదీశాడు. బెన్ స్టోక్స్‌ను ఆరో వికెట్‌గా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత మిగతా బ్యాటర్లు ఎవరూ భారత బౌలర్లను ఇబ్బంది పెట్టలేకపోయారు. రెండో ఇన్నింగ్స్‌లో ఆకాష్ దీప్ ఆరు వికెట్లు దక్కించుకోగా, సిరాజ్, ప్రసిద్ధ్, వాషింగ్టన్ సుందర్, జడేజా ఒక్కో వికెట్ తీశారు.


ఇక, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తొలి ఇన్నింగ్స్‌లో డబుల్ సెంచరీ, రెండో ఇన్నింగ్స్‌లో భారీ శతకం చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రవీంద్ర జడేజా, జైస్వాల్, రిషభ్ పంత్, కేఎల్ రాహుల్ అర్ధశతకాలు సాధించారు. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ ఆరు వికెట్లు తీసి పతనాన్ని శాసించాడు. రెండో ఇన్నింగ్స్‌లో ఆకాష్ దీప్ ఆ బాధ్యతను తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో ఆకాష్ దీప్ మొత్తం పది వికెట్లు తీసుకున్నాడు. ఈ మ్యాచ్‌లో టీమిండియా తొలి ఇన్నింగ్స్‌లో 587 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 427/6 పరుగులు చేసింది. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 407 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 271 పరుగులు చేసింది.


ఇవీ చదవండి:

మేమేం పిచ్చోళ్లం కాదు: ఇంగ్లండ్ కోచ్

పంత్‌-గంభీర్ వీడియో వైరల్!

టీమిండియా కోచ్ సెటైర్లు మామూలుగా లేవుగా!

మరిన్ని తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 06 , 2025 | 09:49 PM