Harvansh Singh: టీమిండియాలోకి ట్రక్ డ్రైవర్ కొడుకు! దేశం మీద ప్రేమతో..
ABN , Publish Date - May 24 , 2025 | 04:23 PM
భారత సీనియర్ జట్టుకే కాదు.. జూనియర్ టీమ్స్‌కు ఎంపిక అవడం కూడా అంత సులువు కాదు. భారీ పోటీని తట్టుకొని నిలకడగా రాణిస్తూ పోతే తప్ప సెలెక్ట్ అవ్వలేరు. కానీ ఓ ట్రక్ డ్రైవర్ కొడుకు అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు.

మన దేశంలోని ప్రతి క్రికెటర్‌కు టీమిండియాకు ఆడాలనేదో కల. అయితే ఎంత శ్రమించినా, బాగా రాణించినా అందరికీ ఆ అదృష్టం దక్కదు. జూనియర్ లెవల్ క్రికెట్ నుంచి దేశవాళీలు, ఐపీఎల్.. ఇలా ప్రతి చోటా అదరగొడుతూ రావాలి. అప్పుడు గానీ సెలెక్టర్ల దృష్టిలో పడే అవకాశం ఉండదు. అందుకే జూనియర్ లెవల్ క్రికెట్‌లో అదరగొట్టాలని అందరూ అనుకుంటారు. అయితే భారీ పోటీ నేపథ్యంలో అక్కడా భారత జట్టుకు ఎంపికవడం అంత సులువేం కాదు. కానీ ఓ ట్రక్ డ్రైవర్ కొడుకు అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు. ఇంగ్లండ్ టూర్‌కు వెళ్తున్న భారత జట్టుకు ఎంపియ్యాడు. అతడే హర్వాన్ష్ సింగ్. అతడి గురించి ఇప్పుడు తెలుసుకుందాం..
బిగ్ చాన్స్
సీఎస్‌కే యువ ఓపెనర్ ఆయుష్ మాత్రే సారథ్యంలో త్వరలో ఇంగ్లండ్‌కు వెళ్లనుంది భారత అండర్-19 జట్టు. నెల రోజుల పాటు సాగే ఈ పర్యటనలో ఇంగ్లండ్ లయన్స్‌తో 5 మ్యాచుల యూత్ వన్డే సిరీస్, 2 మల్టీ డేస్ మ్యాచులతో పాటు 50 ఓవర్ల వార్మప్ మ్యాచ్‌లో తలపడనుంది టీమిండియా. ఇదే జట్టుకు ఎంపికయ్యాడు హర్వాన్ష్ సింగ్. సౌరాష్ట్ర తరఫున జూనియర్ లెవల్‌లో అదరగొడుతున్న ఈ కుర్రాడు.. గతేడాది ఆస్ట్రేలియా అండర్-19 జట్టుతో జరిగిన యూత్ టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీతో వెలుగులోకి వచ్చాడు. అతడి ప్రదర్శనకు ఇంప్రెస్ అయిన సెలెక్టర్లు ఇంగ్లండ్ టూర్‌కు ఎంపిక చేశారు. అయితే దీనికి ముందు అతడికి కెనడా వెళ్లే అవకాశం వచ్చింది. కానీ అందుకు హర్వాన్ష్ ఒప్పుకోలేదు.
యువీ స్ఫూర్తితో..
హర్వాన్ష్ సింగ్ తండ్రి దమన్‌దీప్ కెనడాలో ట్రక్ డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కుటుంబం కోసం అతడు చాలా శ్రమిస్తున్నాడు. ఇటు హర్వాన్ష్ తల్లితో కలసి భారత్‌లోనే ఉంటున్నాడు. కొడుకు క్రికెట్ కెరీర్‌ను దృష్టిలో పెట్టుకొని కెనడాకు వచ్చేయ్, ఇటు ప్రయత్నిద్దాం అని దమన్‌దీప్ భరోసా ఇచ్చాడు. కానీ దేశం కోసం కెనడా వెళ్లేందుకు హర్వాన్ష్ ఒప్పుకోలేదు. ఎప్పటికైనా భారత సీనియర్ టీమ్‌లో ఆడాలనే తన కోరిక కోసం నాన్నకు నో చెప్పేశాడు. ఇది జరిగిన కొన్నాళ్లకు ఇంగ్లండ్‌కు వెళ్లే భారత అండర్-19 జట్టుకు ఎంపికయ్యాడు హర్వాన్ష్. కాగా, సిక్సర్ కింగ్ యువరాజ్ సింగ్‌కు వీరాభిమాని అయిన ఈ కుర్ర బ్యాటర్.. యువీలాగే భారత జట్టు తరఫున అదరగొట్టాలని కలలుగంటున్నాడు. మరి.. త్వరలో అతడు ఇండియా సీనియర్ టీమ్‌లోకి ఎంట్రీ ఇస్తాడేమో చూడాలి.
ఇవీ చదవండి:
కోహ్లీ రిటైర్‌మెంట్‌పై బీసీసీఐ రియాక్షన్
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి