Home » BCCI
భారత్ వెటరన్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలకు త్వరలో బీసీసీఐ బిగ్ షాక్ ఇవ్వనున్నట్లు సమాచారం. సెంట్రల్ కాంట్రాక్ట్ లో వారి కేటగిరీని మార్చనున్నారని తెలుస్తుంది. అదే జరిగితే వారి జీతంలో రూ.2 కోట్లు తగ్గనుంది.
పుదుచ్చేరి క్రికెట్‌లో సంచలన ఘటన చోటు చేసుకుంది. అండర్ 19 జట్టు హెడ్ కోచ్ వెంకట రమణపై ముగ్గురు స్థానిక ఆటగాళ్లు దాడి చేశారు. ఈ ఘటనలో కోచ్ నుదిటిపై 20 కుట్లు.. భుజం ఫ్రాక్చర్ అయినట్లు తెలుస్తోంది.
ఐపీఎల్ 2026 వేలానికి సంబంధించిన తుది జాబితా పేర్లను బీసీసీఐ ప్రకటించింది. మొత్తం 1355 మంది అప్లై చేసుకోగా.. 1005 మందిని తొలగించి, 350 మందిని షార్ట్ లిస్ట్ చేసింది. కాగా మెగా వేలం డిసెంబర్ 16న జరగనుంది.
అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగాలంటే దేశవాళీల్లో ఆడాల్సిందేనని సెలక్షన్ కమిటీ ఇప్పటికే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ విజయ్ హజారే ట్రోఫీలో ఆడబోనని చెప్పినట్లు సమాచారం.
టీమిండియా స్టార్ ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీలతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, అజిత్ అగార్కర్ త్వరలో కీలక సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. 2027 ప్రపంచకప్ విషయంలో వారి నుంచి స్పష్టత తీసుకోవడం, జట్టు వారి నుంచి ఏం ఆశిస్తోందో చెప్పడమే దీని ముఖ్య ఉద్దేశమని తెలుస్తోంది.
సౌతాఫ్రికా చేతిలో టీమిండియా వైట్ వాష్‌కు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో హెడ్ కోచ్ గంభీర్‌ను ఆ పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు వచ్చాయి. ఈ విషయంపై తాజాగా బీసీసీఐ స్పందించింది. గంభీర్‌కు బీసీసీఐ మద్దుతుగా నిలిచింది.
వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ 2026 జరగనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా మంగళవారం రిలీజ్ అయింది. ఈ టోర్నీలో భాగంగా భారత్ లో ఐదు వేదికల్లో మ్యాచులు జరగనున్నాయి. ఈ వేదికల ఎంపిక విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
బీసీసీఐ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. నవంబర్ 30 నుంచి సౌతాఫ్రికాతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ఆడనుంది. వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచ కప్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ సిరీస్‌కు బుమ్రా, హార్దిక్ పాండ్యలకు రెస్ట్ ఇవ్వనున్నట్లు సమాచారం.
సౌతాఫ్రికాతో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ నొప్పి కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు. తీవ్రమైన మెడ నొప్పి కారణంగా అతడిని ఆసుపత్రిలో చేర్చినట్లు బీసీసీఐ వెల్లడించింది. కాగా ఈ టెస్ట్‌లో గిల్ ఆడటం కష్టమమే అని సమాచారం.
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ వన్డేల్లో కొనసాగాలంటే దేశవాళీ క్రికెట్ ఆడాలని బీసీసీఐ స్పష్టం చేసింది. దీంతో వీరిద్దరూ త్వరలోనే జరగనున్న విజయ్ హజారే ట్రోఫీ, సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో పాల్గొనే అవకాశం ఉంది.