Share News

Ind Vs SA: కోల్‌కతా టెస్ట్‌లో గిల్ ఆడటం కష్టమే..!

ABN , Publish Date - Nov 15 , 2025 | 09:30 PM

సౌతాఫ్రికాతో టెస్టులో టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ మెడ నొప్పి కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు. తీవ్రమైన మెడ నొప్పి కారణంగా అతడిని ఆసుపత్రిలో చేర్చినట్లు బీసీసీఐ వెల్లడించింది. కాగా ఈ టెస్ట్‌లో గిల్ ఆడటం కష్టమమే అని సమాచారం.

Ind Vs SA: కోల్‌కతా టెస్ట్‌లో గిల్ ఆడటం కష్టమే..!
Ind Vs SA

ఇంటర్నెట్ డెస్క్: కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్-సౌతాఫ్రికా మధ్య తొలి టెస్ట్ జరుగుతున్న విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్(Shubman Gill) మెడ నొప్పి కారణంగా రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్ చేరాడు. సౌతాఫ్రికా బౌలర్ల ధాటికి టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్ అంతా కుప్పకూలిపోతున్నా గిల్ క్రీజులోకి రాలేకపోయాడు. దీంతో అతడికి పెద్ద గాయమేమైనా అయిందేమోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. తీవ్రమైన మెడ నొప్పి కారణంగా అతడిని ఆసుపత్రిలో చేర్చినట్లు బీసీసీఐ వెల్లడించింది. కాగా ఈ టెస్ట్‌లో గిల్ ఆడటం కష్టమమే అని సమాచారం.


బీసీసీఐ స్పందనిదే..

గిల్ గాయంపై బీసీసీఐ(BCCI) స్పందించింది. ‘గిల్ తీవ్రమైన మెడ నొప్పితో విలవిల్లాడాడు. దీంతో రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగినా అనంతరమే అతడికి ఆసుపత్రికి తరలించాం. బీసీసీఐ మెడికల్ టీమ్ అతడిని పర్యవేక్షిస్తోంది. అతడి పరిస్థితిని సమీక్షించిన తర్వాతే గిల్ బ్యాట్ పట్టడంపై అప్‌డేట్ ఉంటుంది’ అని తెలిపింది.


నిద్రలేమి వల్లే..

సౌతాఫ్రికాతో టెస్ట్‌లో గిల్ గాయపడటంపై టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నే మోర్కెల్(Morne Morkel) కూడా స్పందించాడు. ‘అసలు ఆ మెడ నొప్పి ఎందుకు వచ్చింది అనే దానిపై స్పష్టత తెచ్చుకుంటాం. మెడ కండరాలు పట్టుకోవడానికి కారణం పని ఒత్తిడి కాదు.. సరైన నిద్ర లేకపోవడం అని భావిస్తున్నాం. గిల్ చాలా ఫిట్‌గా ఉంటాడు. త్వరలోనే రికవరీ అవుతాడు. ఉదయం నిద్రలేచేటప్పటికే మెడ పట్టేసింది. అది రోజంతా కొనసాగింది. గిల్ బ్యాటింగ్ చేయకపోవడం అనేది మన దురదృష్టం’ అని మోర్నే తెలిపాడు.


ఇదిలా ఉండగా.. రెండో రోజు ఆట ముగిసే సమయానికి సౌతాఫ్రికా ఏడు వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. దీంతో భారత్‌పై 63 పరుగుల ఆధిక్యాన్ని ప్రదర్శిస్తోంది. కోర్బిన్ బాష్(1), టెంబా బావుమా(29) క్రీజులో ఉన్నారు. భారత బౌలర్లలో రవీంద్ర జడేజా(Jadeja) విజృంభించాడు. ఏకంగా నాలుగు వికెట్లు తీసుకొని 28 పరుగుల మాత్రమే ఇచ్చాడు. కుల్దీప్ యాదవ్ 2, అక్షర్ పటేల్ ఓ వికెట్ పడగొట్టారు. ఓవర్‌నైట్ 37/1తో రెండో రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా 189 పరుగులకు ఆలౌటైంది.


ఇవి కూడా చదవండి:

సీఎస్కే కెప్టెన్ ఎవరంటే?

ఏ ఫ్రాంచైజీ ఎవరిని రిలీజ్ చేసిందంటే?

మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Nov 15 , 2025 | 09:30 PM