T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ 2026 టోర్నీలో తెలుగు రాష్ట్రాలకు అన్యాయం..!
ABN , Publish Date - Nov 26 , 2025 | 08:14 AM
వచ్చే ఏడాది టీ20 వరల్డ్ కప్ 2026 జరగనున్న సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన షెడ్యూల్ కూడా మంగళవారం రిలీజ్ అయింది. ఈ టోర్నీలో భాగంగా భారత్ లో ఐదు వేదికల్లో మ్యాచులు జరగనున్నాయి. ఈ వేదికల ఎంపిక విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.
ఇంటర్నెట్ డెస్క్: వచ్చే ఏడాది జరగనున్న టీ20 వరల్డ్ కప్(T20 World Cup 2026) షెడ్యూల్ వచ్చిన సంగతి తెలిసిందే. మంగళవారం ఈ టోర్నీ షెడ్యూల్ ను ఐసీసీ ప్రకటించింది. ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరిగే ఈ టోర్నమెంట్ ను భారత్, శ్రీలంక(Srilanaka)లు ఉమ్మడిగా నిర్వహించనున్నాయి. అలానే ముందస్తు ఒప్పందం ప్రకారం పాకిస్థాన్ మ్యాచ్‌లన్నీ శ్రీలంక వేదికగా జరగనున్నాయి. ఒకవేళ పాక్ జట్టు నాకౌట్ చేరి, అక్కడి నుంచి ఫైనల్ కు చేరితే.. ఆ మ్యాచ్‌లు కూడా శ్రీలంకలోనే జరుగుతాయి. ఇది ఇలా ఉంటే భారత్ లో ఐదు వేదికల్లో మ్యాచులు జరగనున్నాయి. ఈ వేదికల ఎంపిక విషయంలో రెండు తెలుగు రాష్ట్రాలకు అన్యాయం జరిగిందని క్రీడా నిపుణులు చెబుతున్నారు.
భారత్‌లో జరిగే ఈ వరల్డ్ కప్ 2026 మ్యాచ్‌లకు అహ్మదాబాద్, ఢిల్లీ, కోల్‌కతా చెన్నై, ముంబై(Mumbai) నగరాలు ఆతిథ్యమివ్వనున్నాయి. పాకిస్థాన్, నాకౌట్‌తో పాటు ఫైనల్ చేరకపోతే ముంబై, కోల్‌కతాలో సెమీఫైనల్స్, అహ్మదాబాద్ వేదికగా ఫైనల్ మ్యాచులు జరగనున్నాయి. అయితే బీసీసీఐ ఈ టోర్నీలో ఒక్క మ్యాచ్‌ను కూడా తెలుగు రాష్ట్రాలకు(no matches for Telugu states,) కేటాయించలేదు. తెలంగాణాలోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంతో పాటు ఆంధ్రప్రదేశ్(Andhra Pradeh) లోని విశాఖ స్టేడియాలను బీసీసీఐ పట్టించుకోలేదు. పాకిస్థాన్ మ్యాచ్‌లు శ్రీలంక వేదికగా జరగనుండటం కూడా హైదరాబాద్ వేదికను ఎంపిక చేయకపోవడానికి ప్రధాన కారణమనే అభిప్రాయాలు వ్యక్తమవుతోన్నాయి.
వన్డే ప్రపంచకప్ 2023లో పాకిస్థాన్ మ్యాచ్‌లు రాజీవ్ గాంధీ స్టేడియంలో జరిగిన సంగతి తెలిసిందే. ఏది ఏకమైనప్పటికీ వైజాగ్(Vizag), హైదరాబాద్(Hyderabad) నగరాలకు ఒక్క మ్యాచ్ కేటాయించకపోవడంపై అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దక్షిణ భారత దేశం నుంచి చెన్నై(Chennai) ఒక్క నగరాన్నే ఎంపిక చేయడం ఏంటని మండిపడుతున్నారు. గ్రౌండ్స్ ఎంపిక విషయంలో రొటేషన్ పాలసీని పాటిస్తామని చెప్పే బీసీసీఐ.. అహ్మదాబాద్, చెన్నై, ముంబై నగరాలకు మాత్రం ఇలాంటి నిబంధనలు వర్తింపచేయదని మండిపడుతున్నారు. బీసీసీఐలో గుజరాత్, ముంబైదే పూర్తి పెత్తనంగా మారిందని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Nikhil Choudhary: ఆస్ట్రేలియా గడ్డపై భారతీయుడి సరికొత్త చరిత్ర
ప్రాక్టీస్ మొదలుపెట్టిన శ్రేయస్!