Nikhil Choudhary: ఆస్ట్రేలియా గడ్డపై భారతీయుడి సరికొత్త చరిత్ర
ABN , Publish Date - Nov 26 , 2025 | 07:37 AM
ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారతీయులు .. తమ ప్రతిభతో దేశానికి కీర్తి ప్రతిష్టాలు తీసుకొస్తున్నారు. కొందరు పలు రికార్డులను క్రియేట్ చేసి చరిత్రలో నిలిస్తున్నారు. తాజాగా మరో భారతీయుడు సరికొత్త చరిత్ర సృష్టించాడు.
ఇంటర్నెట్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు అనేక ప్రాంతాల్లో ఉన్నారు. అంతేకాక తమ నైపుణ్యంతో పలు దేశాల్లో కీలక పదవుల్లో ఉన్నారు. మరికొందరు అయితే క్రీడా రంగంలో రాణిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది భారతీయులు ఇతర దేశాల్లో పలు రికార్డులు సృష్టించిన సంగతి తెలిసిందే. తాజాగా నిఖిల్ చౌదరి అనే భారతీయుడు ఆస్ట్రేలియా(Australia) గడ్డపై సరికొత్త చరిత్ర లిఖించాడు. ఆసీస్ ఫస్ట్‌క్లాస్ హిస్టరీలో శతకం బాదిన తొలి భారతీయుడిగా రికార్డు సాధించాడు.
శుభ్‌మన్ గిల్ సహచర క్రికెటర్:
ఢిల్లీలో జన్మించిన నిఖిల్ చౌదరి(Nikhil Choudhary).. దేశీ క్రికెట్‌లో పంజాబ్ జట్టుకు ప్రాతినిథ్యం వహించాడు. భారత జట్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ Shubman Gill).. స్టార్ ప్లేయర్లు అభిషేక్ శర్మ, అర్ష్‌దీప్ సింగ్ (Arshdeep Singh)లతో కలిసి లిస్ట్-ఎ క్రికెట్ ఆడాడు. అయితే, ఇండియాలో అతడికి ఆశించిన మేర అవకాశాలు రాలేదు. ఆస్ట్రేలియాకు వెళ్లిన నిఖిల్ చౌదరి.. కోవిడ్-19 (Covid 19) కారణంగా అక్కడే ఉండిపోవాల్సి పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత కూడా అతడు ఇండియాకు తిరిగి రావాలని అనుకోలేదు. ఆస్ట్రేలియాలోనే ఉంటూ శాశ్వత నివాసిగా మారిపోయాడు. అలానే అంతర్జాతీయ స్థాయి క్రికెటర్ కావాలన్న అతడి కలను మాత్రం మర్చిపోలేదు.
ఎలాగైనా తన లక్ష్యాన్ని అందుకోవాలని నిఖిల్ చౌదరి బలంగా సంకల్పించాడు. క్రికెట్ శిక్షణ కోసం డబ్బు కూడబెట్టడం మొదలుపెట్టాడు. మాంసం షాపులో పని చేయడంతో పాటు డెలివరీ బాయ్‌గా, ఉబర్ క్యాబ్ డ్రైవర్(Uber Cab Driver)గా పని చేస్తూ ఎన్నో కష్టనష్టాలకు భరించాడు. నిఖిల్ చౌదరి శ్రమకు ఫలితం దక్కింది. ఆస్ట్రేలియా టీ20 టోర్నీ బిగ్ బాష్ లీగ్‌లో ఆడే ఛాన్స్ అతడికి వచ్చింది. హోబర్ట్ హ్యారికేన్స్‌కు ప్రాతినిథ్యం వహించే సమయంలో నిఖిల్.. పాకిస్థాన్(Pakistan) బౌలర్ హ్యారిస్ రవూఫ్ బౌలింగ్‌లో సిక్సర్ బాది.. దానిని తొడగొడుతూ మరీ సెలబ్రేట్ చేసుకోవడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు.
సరికొత్త చరిత్ర:
ఆస్ట్రేలియా ఫస్ట్ క్లాస్ క్రికెట్(Australia first-class cricket) టోర్నీ షెఫీల్డ్ షీల్డ్‌లో టాస్మేనియాకు ఆడుతున్న నిఖిల్ ఇటీవలే సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు. న్యూ సౌత్ వేల్స్‌తో మ్యాచ్‌లో ఈ స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్.. సెంచరీ బాదాడు. 184 బంతుల్లో 163 పరుగులు రాబట్టాడు. తద్వారా ఆస్ట్రేలియా దేశీ రెడ్‌బాల్ టోర్నీలో సెంచరీ చేసిన భారత మూలాలున్న తొలి ప్లేయర్ గా నిలిచాడు. ఈ మ్యాచ్‌లో టాస్మేనియా న్యూ సౌత్ వేల్స్‌పై ఇన్నింగ్స్ 58 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇవి కూడా చదవండి:
ప్రాక్టీస్ మొదలుపెట్టిన శ్రేయస్!