Share News

T20 World Cup: ఒకే గ్రూప్‌లో భారత్‌ పాక్‌

ABN , Publish Date - Nov 26 , 2025 | 02:47 AM

ఇటీవలి కాలంలో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పెద్ద టోర్నీల్లో ఇరుజట్లనూ వేర్వేరు గ్రూపుల్లో ఆడిస్తారని భావించారు. కానీ, ఐసీసీ మాత్రం మరోసారి కాసులపైనే దృష్టిపెట్టింది. టీ20 వరల్డ్‌క్‌పలో...

T20 World Cup: ఒకే గ్రూప్‌లో భారత్‌ పాక్‌

ఫిబ్రవరి 15న హైవోల్టేజ్‌ మ్యాచ్‌

టీ20 వరల్డ్‌కప్‌ షెడ్యూల్‌ విడుదల

న్యూఢిల్లీ: ఇటీవలి కాలంలో భారత్‌, పాకిస్థాన్‌ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పెద్ద టోర్నీల్లో ఇరుజట్లనూ వేర్వేరు గ్రూపుల్లో ఆడిస్తారని భావించారు. కానీ, ఐసీసీ మాత్రం మరోసారి కాసులపైనే దృష్టిపెట్టింది. టీ20 వరల్డ్‌క్‌పలో చిరకాల ప్రత్యర్థులు భారత్‌, పాకిస్థాన్‌లు మరోసారి ఒకే గ్రూప్‌లో తలపడనున్నాయి. గ్రూప్‌-ఎలో ఫిబ్రవరి 15న కొలంబోలో ఇండో-పాక్‌ సమరం జరగనుంది. వచ్చే ఏడాది జరిగే పొట్టికప్‌ షెడ్యూల్‌ను ఐసీసీ చైర్మన్‌ జై షా మంగళవారం విడుదల చేశారు. భారత్‌, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న పొట్టికప్‌ ఫిబ్రవరి ఏడున ఆరంభం కానుండగా.. మార్చి 8న ఫైనల్‌ జరగనుంది. 20 జట్లు పాల్గొంటున్న టోర్నీలో మొత్తం 55 మ్యాచ్‌లకు ఢిల్లీ, కోల్‌కతా, అహ్మదాబాద్‌, చెన్నై, ముంబైతోపాటు శ్రీలంకలోని కొలంబో, క్యాండీలను వేదికలుగా ఖరారు చేశారు. పాక్‌ ఫైనల్‌ చేరకపోతే తుది పోరుకు అహ్మదాబాద్‌ ఆతిథ్యమిస్తుంది. అలాగే, పాక్‌ సెమీస్‌కు రాకుంటే.. ముంబై, కోల్‌కతాల్లో సెమీస్‌ మ్యాచ్‌లు నిర్వహించే చాన్సుంది. ఫిబ్రవరి 7న కొలంబోలో జరిగే టోర్నీ ఆరంభ మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌తో పాక్‌ ఆడనుంది. అదేరోజు ముంబైలో అమెరికాతో భారత్‌ తలపడనుంది. ఫిబ్రవరి 12న ఢిల్లీలో నమీబియాతో, 18న అహ్మదాబాద్‌లో నెదర్లాండ్స్‌తో టీమిండియా ఆడనుంది.


7-Sports.jpg

టోర్నీ అంబాసిడర్‌గా రోహిత్‌

టోర్నీ ప్రచారకర్తగా భారత జట్టు మాజీ కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వ్యవహరించనున్నాడు. 2024లో యూఎ్‌సలో జరిగిన టోర్నీలో రోహిత్‌ సారథ్యంలో భారత్‌ వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచింది. ఈ విజయ సంబరాల్లోనే రోహిత్‌ పొట్టి ఫార్మాట్‌కు వీడ్కోలు పలికాడు.

ఫార్మాట్‌ ఇలా..

టోర్నీలో పాల్గొంటున్న 20 జట్లను నాలుగు గ్రూప్‌లుగా విభజించారు. గ్రూప్‌-ఎలో భారత్‌, అమెరికా, నమీబియా, నెదర్లాండ్స్‌, పాకిస్థాన్‌.. గ్రూప్‌-బిలో ఆస్ట్రేలియా, శ్రీలంక, జింబాబ్వే, ఐర్లాండ్‌, ఒమన్‌, గ్రూప్‌-సిలో ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, ఇటలీ, నేపాల్‌.. గ్రూప్‌-డిలో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్‌, అఫ్ఘానిస్థాన్‌, కెనడా, యూఏఈ జట్లున్నాయి. ప్రతి గ్రూప్‌లో టాప్‌-2లో నిలిచిన జట్లు సూపర్‌-8కు అర్హత సాధిస్తాయి. ముందుగా నిర్దేశించిన సీడింగ్‌ల ప్రకారం సూపర్‌-8 టీమ్‌లను రెండు గ్రూప్‌లుగా విభజిస్తారు. ఆ రెండు గ్రూపులలో టాప్‌-2లో నిలిచే జట్లు సెమీ్‌సలో అమీతుమీ తేల్చుకొంటాయి. శ్రీలంక ఉన్న గ్రూప్‌-బితోపాటు పాక్‌ ఆడే మ్యాచ్‌లన్నీ (నాకౌట్‌ సహా) తటస్థ వేదికైన లంకలోనే జరగనున్నాయి.

ఇవి కూడా చదవండి:

భారత్-పాక్ మ్యాచ్ ఎప్పుడంటే?

ప్రాక్టీస్ మొదలుపెట్టిన శ్రేయస్!

Updated Date - Nov 26 , 2025 | 02:47 AM