Hyderabad: ప్రేమ విఫలం.. టెకీ ఆత్మహత్య
ABN , Publish Date - Nov 26 , 2025 | 07:07 AM
ప్రేమ విఫలమైందని మనస్తాపంతో ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న విషాద సంఘటన హైదరాబాద్ నగర శివారులో జరిగింది. ఆంధ్రప్రదేశ్ లోని గుంటూరు జిల్లాకు చెందిన కుర్ర పవన్ కళ్యాణ్‌రెడ్డి ఉద్యోగం చేస్తున్నాడు. అయితే.. ప్రేమ విఫలమైందన్న కిరణంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
హైదరాబాద్: ప్రేమ విఫలమైందని మనస్తాపంతో ఐటీ ఉద్యోగి ఆత్మహత్యకు చేసుకున్నాడు. ఈ ఘటన మేడ్చల్- మల్కాజిగిరి(Medchal- Malkajgiri) జిల్లా, పోచారం ఐటీ కారిడార్ పోలీసుస్టేషన్ పరిధి సింగపూర్ టౌన్‌షిప్‌లో చోటు చేసుకుంది. సీఐ రాజువర్మ తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, గుంటూరు(Guntur) జిల్లా, సంగడిగుంటకు చెందిన కుర్ర శ్రీనివాస్‌రెడ్డి కుమారుడు కుర్ర పవన్ కళ్యాణ్‌రెడ్డి(26) సింగపూర్‌టౌన్‌షి్‌పలో స్నేహితులతో కలిసి అద్దెకుంటూ ఇన్ఫోసిస్‌లో ఐటీ ఉద్యోగం చేస్తున్నాడు.

ప్రేమ విఫలం కావడంతో సోమవారం రాత్రి తను ఉంటున్న గదిలో బెడ్‌షీట్‌తో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గమనించిన స్నేహితులు మృతుడి కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మంగళవారం ఉదయం మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. తన కుమారుడి మృతి పట్ల అనుమానం లేదని, ప్రేమవిఫలమే కారణమని మృతుడి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ వార్తలు కూడా చదవండి..
పైరసీ చేయడు.. సినిమాలు కొంటాడు
మావోయిస్టుల కస్టడీ పిటిషన్ వెనక్కి
Read Latest Telangana News and National News