Gautam Gambhir: మాకు నువ్వేం చెప్పనక్కర్లేదు.. పిచ్ క్యూరేటర్‌తో గంభీర్ వాగ్వాదం..
ABN , Publish Date - Jul 29 , 2025 | 05:58 PM
ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరగాల్సిన చివరి మ్యాచ్ లండన్‌లోని ఓవల్ మైదానంలో గురువారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. గంభీర్ దగ్గరుండి శిక్షణను పర్యవేక్షిస్తున్నాడు.

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ (Gautam Gambhir), ఓవల్ పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరగాల్సిన చివరి మ్యాచ్ లండన్‌లోని ఓవల్ మైదానంలో గురువారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది (Ind vs Eng). ఈ నేపథ్యంలో స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. గంభీర్ దగ్గరుండి శిక్షణను పర్యవేక్షిస్తున్నాడు. ఆ సమయంలో పిచ్ క్యూరేటర్ (Oval pitch curator) అయిన లీ ఫోర్టిస్ అక్కడకు చేరుకున్నాడు.
ఆటగాళ్లతో ప్రాక్టీస్ చేస్తున్న గంభీర్‌తో ఏదో మాట్లాడాడు. ముందుగా వారిద్దరూ శాంతంగానే మాట్లాడుకున్నారు. అంతలోనే పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఆ సమయంలో గంభీర్.. 'నువ్వు ఇక్కడ కేవలం మైదాన సిబ్బందివి మాత్రమే. మాకు నువ్వేం చెప్పనక్కర్లేదు. ఏం చేయాలో మాకు తెలుసు. కావాలంటే మీ అధికారులకు ఫిర్యాదు చేసుకో' అంటూ గంభీర్ చెప్పడం కనిపిస్తోంది. ఆ సమయంలో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ కలుగచేసుకుని పిచ్ క్యూరేటర్‌ను కాస్త దూరంగా తీసుకెళ్లి సముదాయించాడు. అయినప్పటికీ గంభీర్, క్యూరేటర్ మధ్య వాగ్వాదం కొనసాగింది.
ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా, గంభీర్ ప్రవర్తనపై ఓవల్ మైదానం సిబ్బంది ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు ఫిర్యాదు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా ఇప్పటివరకు జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది. చివరి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా విజయం సాధిస్తే సిరీస్ డ్రా అవుతుంది.
ఇవి కూడా చదవండి..
ఇంగ్లండ్‌తో 4వ టెస్టు మ్యాచ్ టీమిండియా అద్భుత పోరాటం
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..