Home » Gautam Gambhir
టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్, ఓవల్ పిచ్ క్యూరేటర్ లీ ఫోర్టిస్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ ఇద్దరి మధ్య ఏం జరిగిందో టీమిండియా బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ వెల్లడించాడు.
ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరగాల్సిన చివరి మ్యాచ్ లండన్‌లోని ఓవల్ మైదానంలో గురువారం నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలో స్టేడియంలో టీమిండియా ఆటగాళ్లు ప్రాక్టీస్ చేస్తున్నారు. గంభీర్ దగ్గరుండి శిక్షణను పర్యవేక్షిస్తున్నాడు.
బీసీసీఐ రూల్స్ విషయంలో టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో విభేదించాడు టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్. మనం హాలీడే కోసం రాలేదని, దేశం కోసం ఆడేందుకు వచ్చామంటూ గట్టిగా ఇచ్చిపడేశాడు.
టీమిండియా మర్చిపోలేని విజయాన్ని అందుకుంది. ఎన్నాళ్ల నుంచో ఊరిస్తూ వస్తున్న ఎడ్జ్‌బాస్టన్‌లో గెలుపుబావుటా ఎగురవేసింది గిల్ సేన.
టీమిండియా హెడ్ కోచ్ గౌతం గంభీర్, పించ్ హిట్టర్ రిషబ్ పంత్ మాట్లాడుకుంటున్న ఓ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. అతడ్ని తీసెయ్ అంటూ గౌతీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
గంభీర్ పర్యవేక్షణలో టీమిండియా ఘోర వైఫల్యాలు ఎదుర్కొంది. భారత జట్టు ఆడిన చివరి 9 టెస్ట్ మ్యాచ్‌ల్లో ఏకంగా ఏడింట్లో ఓడిపోయింది. ప్రస్తుతం జరుగుతున్న ఇంగ్లండ్ సిరీస్ తొలి టెస్ట్ మ్యాచ్‌లో గెలిచే స్థితి నుంచి ఓటమి పాలైంది. టీమిండియా ఓటమి నేపథ్యంలో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై ఒత్తిడి తీవ్రమవుతోంది.
తొలి టెస్ట్ ఓటమితో నిరాశలో ఉన్న భారత్.. రెండో మ్యాచ్‌లో ఇంగ్లండ్‌ను చావుదెబ్బ తీయాలని చూస్తోంది. ఎడ్జ్‌బాస్టన్ వేదికగా జరిగే ఈ టెస్ట్‌లో నెగ్గి సిరీస్‌ను సమం చేయాలని అనుకుంటోంది.
భారత జట్టు హెడ్ కోచ్ గౌతం గంభీర్ తిరిగి ఇంగ్లండ్‌కు వెళ్తున్నాడని తెలుస్తోంది. ఉన్నపళంగా గౌతీ స్వదేశానికి ఎందుకు వచ్చాడు? మళ్లీ తిరుగు ప్రయాణం ఎందుకు అవుతున్నాడు? అనేది ఇప్పుడు చూద్దాం..
శుభ్‌మన్ గిల్ సారథ్యంలోని యువ జట్టు ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలో ఉంది. ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ కోసం సన్నద్ధమవుతోంది. కోచ్ గంభీర్, కొత్త కెప్టెన్ గిల్ టీమిండియాను ఇంగ్లండ్‌లో ఎలా నడిపిస్తారో అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ కోసం జోరుగా సన్నద్ధమవుతున్నారు భారత ఆటగాళ్లు. ప్రత్యర్థిని వాళ్ల సొంతగడ్డ మీదే చిత్తుగా ఓడించాలని చూస్తున్నారు.