Share News

Raina Supports Gautam: కోచ్ కన్నా ప్లేయర్లదే ఎక్కువ బాధ్యత.. గంభీర్‌కు మద్దతుగా రైనా

ABN , Publish Date - Nov 26 , 2025 | 10:09 AM

ఇటీవల టీమిండియా హెచ్ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ను తప్పించాలనే డిమాండ్స్ పెరిగాయి. అయితే గౌతమ్‌ గంభీర్‌కు మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా మద్దతుగా నిలిచాడు. అతడు కోచ్‌గా తన పని తాను చేస్తున్నాడన్నాడు. ఓటములకు కోచ్‌ కన్నా కూడా ఆటగాళ్లే ఎక్కువ బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపాడు

Raina Supports Gautam: కోచ్ కన్నా ప్లేయర్లదే ఎక్కువ బాధ్యత.. గంభీర్‌కు మద్దతుగా రైనా
Gautam Gambhir

ఇంటర్నెట్ డెస్క్: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండు టెస్టు మ్యాచుల సిరీస్ లో భారత్ ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. ఇప్పటికే ఇప్పటికే కోల్‌కతా టెస్ట్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి చవిచూసింది. ఈ సిరీస్‌లో 0-1తో వెనకబడి ఉంది. ప్రస్తుతం గువాహటి వేదికా జరుగుతున్న రెండో టెస్ట్‌లోనూ భారత్ ఓటమి అంచున ప్రయాణిస్తోంది. అంతకుముందే స్వదేశంలో న్యూజిలాండ్‌ చేతిలో వైట్‌వాష్‌కు గురైంది. ఈ నేపథ్యంలో హెచ్ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ను (Gautam Gambhir) తప్పించాలనే డిమాండ్స్ పెరిగాయి. అయితే గౌతమ్‌ గంభీర్‌కు మాజీ క్రికెటర్‌ సురేశ్‌ రైనా(Suresh Raina) మద్దతుగా నిలిచాడు. అతడు కోచ్‌గా తన పని తాను చేస్తున్నాడన్నాడు. ఓటములకు కోచ్‌ కన్నా కూడా ఆటగాళ్లే ఎక్కువ బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపాడు.


'హెడ్ కోచ్‌గా గౌతమ్‌ గంభీర్‌ తన పని తాను చేస్తున్నాడు. ఓ ఏడాది క్రితం భారత్ ఛాంపియన్స్‌ ట్రోఫీని గెలిచింది. అలాగే టీ20 వరల్డ్‌కప్‌నూ కైవసం చేసుకుంది. ఇటీవల ఆసియా కప్‌లోనూ (Asia Cup 2025) విజేతగా నిలిచింది. ఆయన ఆధ్వర్యంలోనే ఈ విజయాలు అందాయి. కోచ్‌ అనే వ్యక్తి ఆటగాళ్లకు దిశానిర్దేశం మాత్రమే చేయగలడు. బ్యాటర్లే పరుగులు చేయాల్సి ఉంటుంది. ఆటగాళ్లు గెలుపుపై విశ్వాసం కోల్పోవద్దు. నేను క్రికెట్‌ ఆడిన రోజుల్లో.. ఒకవేళ సిరీస్‌లో వెనకబడ్డా కూడా తిరిగి తప్పకుండా పుంజుకుంటామనే గట్టి నమ్మకంతో ఉండేవాళ్లం. బ్యాటింగ్‌లో భాగస్వామ్యాలు నెలకొల్పడం పైనే విజయం ఆధారపడి ఉంటుంది’ అని రైనా పేర్కొన్నాడు.


బ్యాటర్లు పరుగులు సాధించాలంటే ఏం చేయాలో కూడా రైనా వివరించాడు. ఎక్కువగా మ్యాచ్‌ ప్రాక్టీస్‌ ఉండాలని, దేశవాళీ క్రికెట్‌ ఆడాలని సలహా ఇచ్చాడు. అజింక్య రహానే (Ajinkya Rahane), ఛతేశ్వర్‌ పుజారా (Cheteshwar Pujara) దేశవాళీ మ్యాచుల్లో ఆడి తమ ఫామ్‌, రిథమ్‌ను కాపాడుకునేవారని రైనా గుర్తు చేశాడు. దేశవాళీల్లో ఆడటం వల్ల ఆత్మవిశ్వాసమూ పెరుగుతుందని సురేశ్‌ రైనా విశ్లేషించాడు.


ఇవి కూడా చదవండి:

Nikhil Choudhary: ఆస్ట్రేలియా గడ్డపై భారతీయుడి సరికొత్త చరిత్ర

ప్రాక్టీస్ మొదలుపెట్టిన శ్రేయస్!

Updated Date - Nov 26 , 2025 | 10:40 AM