Share News

Vikas Kohli Criticism: గౌతమ్ గంభీర్ పై విరాట్ కోహ్లీ సోదరుడు పరోక్ష కామెంట్స్

ABN , Publish Date - Nov 26 , 2025 | 09:30 AM

గువాహటి వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతోన్న రెండో టెస్టులో భారత్ కష్టాల్లో ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ పరోక్షంగా ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

Vikas Kohli Criticism: గౌతమ్ గంభీర్ పై విరాట్ కోహ్లీ సోదరుడు పరోక్ష కామెంట్స్
India vs South Africa

ఇంటర్నెట్ డెస్క్: గువహటి వేదికగా భారత్, సౌతాఫ్రికా(India vs South Africa)మధ్య రెండో టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టీమిండియా కష్టాల్లో ఉంది. గెలుపు సంగతి పక్కన పెడితే.. కనీసం డ్రా చేయడానికైనా భారత్ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండు వికెట్లు కోల్పోయిన భారత్ 32 పరుగులు చేసింది. ప్రస్తుతం టీమిండియా ముందు 517 పరుగులు భారీ టార్గెట్ ఉంది. ఇప్పటికే ఫస్ట్ టెస్టులో ఓడిన భారత్.. ఈ మ్యాచ్ లోనూ దాదాపు అదే స్థితికి చేరింది. దీంతో భారత్ హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై టీమిండియా క్రికెట్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలానే పలువురు మాజీ క్రికెటర్లకు కూడా ఆయన్ను విమర్శిస్తున్నారు. తాజాగా స్టార్ ప్లేయర్ విరాట్ కోహ్లీ సోదరుడు వికాస్ కోహ్లీ(Vikas Kohli criticism) గౌతమ్ గంభీర్ పై పరోక్షంగా కామెంట్స్ చేశాడు.


ప్రస్తుత టీమిండియా నిర్వహణలో చేసిన మార్పులను ప్రశ్నిస్తూ థ్రెడ్స్ లో వికాస్ కోహ్లీ పోస్ట్‌ పెట్టాడు. కొందరి అనవసరమైన జోక్యం గతంలో భారత్ జట్టుకు మంచి ఫలితాలను అందించిన వ్యవస్థను దెబ్బతీసిందని పరోక్షంగా సూచించాడు. వికాస్.. టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్( Gautam Gambhir) పేరును ప్రస్తావించనప్పటికీ, ఈ సందేశాన్ని కోచ్‌కు సూచనగా, అతను బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి విధానంలో జరిగిన మార్పులను పరోక్షంగా గుర్తు చేస్తున్నాయి.


'ఒకప్పుడు మనం విదేశీ పరిస్థితుల్లో కూడా గెలిచేలా ఆడాం. కానీ, ఇప్పుడు సొంత గడ్డపైనే మనం మ్యాచ్‌ను గెలిచేది పక్కన పెడితే.. ఓడిపోకుండా ఉండేందుకు ఆడుతున్నాం. అనవసరంగా మార్పులు చేసినప్పుడు, తాను బాస్ లా మారేందుకు ప్రయత్నించినప్పుడే ఇలాగే జరుగుతుంది' అని వికాస్ కోహ్లీ థ్రెడ్స్ పోస్ట్‌లో రాశాడు. అయితే ఈ పోస్ట్ గంభీర్( Gautam Gambhir)ను ఉద్దేశించే పెట్టాడని పలువురు అభిప్రాయ పడుతున్నారు.


ఇవి కూడా చదవండి:

Nikhil Choudhary: ఆస్ట్రేలియా గడ్డపై భారతీయుడి సరికొత్త చరిత్ర

ప్రాక్టీస్ మొదలుపెట్టిన శ్రేయస్!

Updated Date - Nov 26 , 2025 | 09:30 AM