Share News

Operation Kalnemi: హిందూ పేర్లతో భారత్‌‌లో బంగ్లాదేశీల పాగా

ABN , Publish Date - Nov 26 , 2025 | 09:06 AM

బంగ్లాదేశీలు భారత్‌లోకి అక్రమంగా ప్రవేశిస్తున్నారు. హిందూ పేర్లు పెట్టుకుని ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించి ప్రభుత్వ పథకాల్ని అనుభవిస్తున్నారు. మరోవైపు, ఉత్తరాఖండ్‌‌లో సాధువులుగా మారువేషాలు వేసుకుని భక్తుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారు. సనాతన ధర్మాన్ని వక్రీకరిస్తున్నారు.

Operation Kalnemi: హిందూ పేర్లతో భారత్‌‌లో బంగ్లాదేశీల పాగా
Operation Kalnemi

డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్) నవంబర్ 26: ఫేక్ డాక్యుమెంట్లు సమర్పించి, స్థానికంగా హిందూ పేరుతో జీవిస్తున్న బంగ్లాదేశీ మహిళను డెహ్రాడూన్ పోలీసులు అరెస్టు చేశారు. 'ఆపరేషన్ కల్నేమి' లో భాగంగా ఉత్తరాఖండ్ ప్రభుత్వం అక్రమ చొరబాటుదారుల ఏరివేత కార్యక్రమం చేపట్టిన సంగతి తెలిసిందే. కొందరు సాధువులుగా మారువేషాలు వేసుకుని ఫేక్ గుర్తింపులతో స్థానికంగా జీవిస్తున్న వారిని గుర్తించి చర్యలు తీసుకుంటున్నారు. వేషధారులు భక్తులను తప్పుదోవ పట్టిస్తున్నారని, మతపరమైన భావాలను దెబ్బతీస్తున్నారని, సనాతన ధర్మాన్ని వక్రీకరిస్తున్నారని సీఎం ధామి చెబుతున్నారు.


ఇలా ఉండగా, ఆపరేషన్ కల్నేమి‌లో ఇవాళ 28 ఏళ్ల బాబ్లీ బేగం (గైబంధా జిల్లా, బంగ్లాదేశ్) అనే మహిళను పోలీసులు అరెస్టు చేశారు. ఆమె 2020లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించింది. మొదట అనేక చోట్ల ఉండి, 2021లో డెహ్రాడూన్‌కు చేరుకుంది. 2022లో డెహ్రాడూన్‌కు చెందిన స్థానికుడిని పెళ్లి చేసుకుని, ఫేక్ పత్రాలతో భూమి శర్మగా పేరు మార్చుకుని హిందు మహిళగా చెలామణీ అవుతోంది.


పోలీసులు ఆమె నుంచి ఆధార్ కార్డు, ఆయుష్మాన్ కార్డు, రేషన్ కార్డు, వోటర్ ఐడీ కార్డు తదితర ఫేక్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో, ఆమె నిజమైన బంగ్లాదేశీ ఐడీ కార్డ్ కూడా లభించింది. ఈ ఉదంతంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఫేక్ డాక్యుమెంట్ల తయారీలో సహాయం చేసిన వారిని పట్టుకునేందుకు చర్యలు చేపడుతున్నారు. బాబ్లీపై అక్రమ నివాసం, ఫేక్ డాక్యుమెంట్ల కేసులు దాఖలు చేశారు. ఆమెను కస్టడీలోకి తీసుకున్నారు. ఇదే తరహాలో ఈ వారంలో మరో ఇద్దరు బంగ్లాదేశీయుల్ని ఉత్తరాఖండ్ పోలీసులు పట్టుకున్నారు.


ఇవీ చదవండి:

మానుతున్న శతాబ్దాల గాయాలు

సూపర్‌ వుడ్‌.. ఉక్కును మించిన చెక్క

Updated Date - Nov 26 , 2025 | 09:31 AM