Share News

Ravi Shastri: పనితీరు బాగా లేకపోతే ఉద్యోగం పోతుంది.. గంభీర్‌కు రవిశాస్త్రి హెచ్చరిక

ABN , Publish Date - Dec 03 , 2025 | 08:05 AM

స్వదేశంలో వరుస టెస్టు సిరీస్‌ల్లో వైట్‌వాష్ కావడంతో ఒత్తిడిలో ఉన్న గౌతమ్ గంభీర్‌కు రవిశాస్త్రి కీలక హెచ్చరిక చేశాడు. పనితీరు బాగాలేకపోతే ఉద్యోగం ప్రమాదంలో పడుతుందని.. పనిని ఆస్వాదించాలని సూచించాడు.

Ravi Shastri: పనితీరు బాగా లేకపోతే ఉద్యోగం పోతుంది.. గంభీర్‌కు రవిశాస్త్రి హెచ్చరిక
Ravi Shastri

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై ఒత్తిడి రోజురోజుకూ పెరుగుతోంది. స్వదేశంలో రెండు టెస్టు సిరీస్‌లు కోల్పోవడం.. ఈ విమర్శలకు దారి తీసింది. భారత క్రికెట్ చరిత్రలో సొంతగడ్డపై వైట్‌వాష్ అయిన తొలి కోచ్‌గా గంభీర్ నిలిచాడు. ఇది మరింత ప్రతికూలతను తెచ్చిపెట్టింది. ఈ క్రమంలో మాజీ క్రికెటర్ రవి శాస్త్రి(Ravi Shastri ) గంభీర్‌కు ఓ స్పష్టమైన హెచ్చరికతో పాటు ఓ కీలక సూచన చేశాడు.


‘నీ పనితీరు బాగాలేదు అంటే.. ఉద్యోగం పోయే ప్రమాదం తప్పదు. అన్నింటినీ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి. ముఖ్యంగా ఇలాంటి సమయాల్లో ఓర్పు అవసరం. కమ్యూనికేషన్, మేనేజ్‌మెంట్ స్కిల్స్ కీలకం. జట్టు గెలవాలంటే.. నువ్వు(Gautam Gambhir) ఆటగాళ్లను ప్రోత్సహించాలి. మేము కోచ్‌గా ఉన్నప్పుడు అదే చేశాం. జట్టును గెలిపించాలంటే నువ్వు ఒత్తిడికి గురి కాకూడదు. పనిని ఆస్వాదించగలగాలి’ అని రవిశాస్త్రి గంభీర్‌కు సూచించాడు.


గెలవలేదని కాదు..!

గంభీర్ ప్రధాన కోచ్‌గా నియమితుడైన తర్వాత టీమిండియా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ 2025 ట్రోఫీల్లో ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా కైవసం చేసుకుంది. కోచ్‌గా గంభీర్ విఫలమని చెప్పడం సరికాదు! స్వదేశంలో వరుసగా రెండు టెస్టు సిరీస్‌ల్లో భారత్ వైట్‌వాష్‌కు గురి కావడంతోనే విమర్శలు మొదలయ్యాయి. గంభీర్ ముక్కుసూటితనం వీటికి మరింత ఆజ్యం పోసింది. ఈ క్రమంలోనే వెటరన్ ప్లేయర్లు రోహిత్ శర్మ-విరాట్ కోహ్లీ, గంభీర్ మధ్య మంచి సంబంధాలు లేవని అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. జట్టులో అంతర్గత వాతావరణం ప్రశాంతంగా లేదనే ప్రచారం నడుస్తోంది. గంభీర్‌కు ఇది కూడా ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం గౌతీ ముందున్న అతిపెద్ద సవాలు.. 2026 టీ20 ప్రపంచ కప్. స్వదేశంలో జరగనున్న ఈ టోర్నీలో టీమిండియా హాట్ ఫెవరెట్‌గా బరిలోకి దిగనుంది.


ఇవి కూడా చదవండి:

ఆ వార్తలన్నీ అవాస్తవం.. ఇప్పట్లో స్మృతి పెళ్లి జరగదు!

ఆ ఫార్మాట్‌లోనూ ఆడే సత్తా ఉంది: తిలక్ వర్మ

Updated Date - Dec 03 , 2025 | 09:02 AM