Tilak Varma: ఆ ఫార్మాట్‌లోనూ ఆడే సత్తా ఉంది: తిలక్ వర్మ
ABN , Publish Date - Dec 03 , 2025 | 06:45 AM
టీ20లతో పాటు వన్డే, టెస్టు ఫార్మాట్లలోనూ తనకు ఆడే సత్తా ఉందని టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ తెలిపాడు. విరాట్ కోహ్లీ సలహాలు తీసుకుంటూ తన ఆటను మెరుగుపర్చుకుంటానని వెల్లడించాడు.
ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా స్టార్ బ్యాటర్ తిలక్ వర్మ.. టీ20 ఫార్మాట్‌లో అదరగొడుతున్న విషయం తెలిసిందే. ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్తాన్‌పై అజేయంగా క్రీజులో నిలబడి భారత్ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. తాజాగా టెస్టు క్రికెట్ ఆడటంపై తిలక్ వర్మ(Tilak Varma) కీలక వ్యాఖ్యలు చేశాడు.
‘టీ20 మాత్రమే కాదు.. వన్డేలు, టెస్టుల్లో కూడా ఆడే సత్తా నాకుంది. సంప్రదాయ ఫార్మాట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాను. మరిన్ని వన్డేలు ఆడేందుకు నేనెంతగానో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నా. ఒకే జట్టులో రోహిత్, విరాట్ ఉంటే ఆటగాళ్లలో ఆత్మవిశ్వాసం మరో స్థాయిలో ఉంటుంది. వాళ్లిద్దరికీ ఎంతో అనుభవం ఉంది. వారి పరుగుల పరిజ్ఞానం అద్భుతం. వీలైనప్పుడల్లా వారి సలహాలు తీసుకుంటూ.. నా ఆటను మెరుగుపరుచుకుంటాను. ముఖ్యంగా విరాట్ ఫిట్‌నెస్ అద్భుతం. అందుకే వికెట్ల మధ్య చురుగ్గా పరుగులు తీసేందుకు అతడి చిట్కాలే పాటిస్తా’ అని తిలక్ అన్నాడు.
ఈ హైదరాబాద్ స్టార్ బ్యాటర్ టీమిండియా తరఫున కేవలం నాలుగే వన్డేలు ఆడాడు. ఇందులో ఓ హాఫ్ సెంచరీ(52) సహా 68 పరుగులు చేశాడు. రెండేళ్ల క్రితం 2023లో సౌతాఫ్రికా పర్యటనలో చివరిసారిగా వన్డే ఆడిన అతడికి మళ్లీ 50 ఫార్మాట్‌లో బరిలోకి దిగే అవకాశం లభించలేదు.
ఇవి కూడా చదవండి:
అతడిని జట్టులోకి ఎందుకు తీసుకున్నారు?.. సెలక్టర్లపై అశ్విన్ ఫైర్
హార్దిక్ పునరాగమనం.. బరోడా ఘన విజయం