Share News

Smriti-Palash: ఆ వార్తలన్నీ అవాస్తవం.. ఇప్పట్లో స్మృతి పెళ్లి జరగదు!

ABN , Publish Date - Dec 03 , 2025 | 07:12 AM

డిసెంబర్ 7న స్మృతి మంధాన పెళ్లి జరుగుతుందన్న వార్తలు పూర్తిగా అవాస్తవమని ఆమె సోదరుడు శ్రావణ్ స్పష్టం చేశాడు. పెళ్లి ఇంకా వాయిదాలోనే ఉందని చెబుతూ సోషల్ మీడియాలో జరుగుతున్న రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టాడు.

Smriti-Palash: ఆ వార్తలన్నీ అవాస్తవం.. ఇప్పట్లో స్మృతి పెళ్లి జరగదు!
Smriti-Palash

ఇంటర్నెట్ డెస్క్: టీమిండియా మహిళా స్టార్ బ్యాటర్ స్మృతి మంధాన(Smriti Mandhana) వివాహం అనూహ్యంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. స్మృతి తండ్రి శ్రీనివాస్ మంధాన అకస్మాత్తుగా అనారోగ్యానికి గురవ్వడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు ఆమెకు కాబోయే భర్త పలాశ్ ముచ్చల్ కూడా తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. ఇటీవల స్మృతి తండ్రి ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అవ్వడంతో పెళ్లిపై రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.


అందులో నిజం లేదు..

డిసెంబర్ 7న స్మృతి పెళ్లి జరగనున్నట్లు ఓ వార్త ప్రచారం జరుగుతోంది. ఇటీవలే పలాశ్(Palash Muchhal) తల్లి అమిత కూడా అత్యంత త్వరలోనే పెళ్లి జరుగుతుందని వెల్లడించడంతో ఈ వార్తకు బలం చేకూరింది. తాజాగా ఈ విషయంపై స్మృతి సోదరుడు శ్రావణ్ మంధాన(Shravan Mandhana) స్పందించాడు. ఈ వార్తల్లో నిజం లేదని వెల్లడించాడు. ‘ఈ రూమర్స్ ఎలా క్రియేట్ అవుతున్నాయో నాకు తెలీదు. ఈ వార్తల్లో నిజం లేదు. ఇప్పట్లో స్మృతి పెళ్లి జరగదు. ఆ వేడుక ఇంకా వాయిదాలోనే ఉంది’ అని తెలిపాడు. దీంతో ఆ వార్తలకు ఫుల్‌స్టాప్ పడింది.


నిజమేనా!

పెళ్లి తంతు వాయిదా పడిన తరుణంలో సోషల్ మీడియాలో రకరకాల వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. పలాశ్ స్మృతిని మోసం చేశాడని.. సంగీత్ రోజే ఆ విషయాలు బయటపడ్డాయని.. అందుకే పెళ్లి ఆపేశారని ప్రచారం జరిగింది. పెళ్లి వేడుకకు సంబంధించిన వీడియోలన్నీ స్మృతి సహా తన స్నేహితురాళ్లు జెమీమా, శ్రేయాంక డిలీట్ చేయడం తీవ్ర చర్చకు దారి తీసింది. ఈ రూమర్స్‌పై అధికారికంగా ఇరువురూ స్పందించకపోయినా.. తాజాగా ఇన్‌స్టా బయోలో ‘దిష్టి’ ఎమోజీ పెట్టడంతో స్మృతి అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ నేపథ్యంలో మంధాన సోదరుడు ఈ విధంగా స్పందించడంతో మళ్లీ రకరకాల సందేహాలు మొదలయ్యాయని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.


ఇవి కూడా చదవండి:

అతడిని జట్టులోకి ఎందుకు తీసుకున్నారు?.. సెలక్టర్లపై అశ్విన్ ఫైర్

హార్దిక్ పునరాగమనం.. బరోడా ఘన విజయం

Updated Date - Dec 03 , 2025 | 07:17 AM