Ind vs Eng third Test Match: పౌల్ రఫెల్ ఉంటే గెలవడం కష్టం.. అశ్విన్ సంచలన వ్యాఖ్యలు..
ABN , Publish Date - Jul 14 , 2025 | 01:19 PM
లార్డ్స్ వేదికగా భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. కాగా, తాజా మ్యాచ్‌లో అంపైర్ పౌల్ రఫెల్ వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా ఉంది.

ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో ఇప్పటికే చెరో టెస్ట్ మ్యాచ్ గెలిచి సమానంగా ఉన్న భారత్, ఇంగ్లండ జట్లు మూడో టెస్ట్ మ్యాచ్‌ను చేజిక్కించుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి (Ind vs Eng third Test ). దీంతో లార్డ్స్ (Lords Stadium) వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు. కాగా, తాజా మ్యాచ్‌లో అంపైర్ పౌల్ రఫెల్ (Paul Reiffel) వ్యవహరించిన తీరు వివాదాస్పదంగా ఉంది.
ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ అవుట్ విషయంలో రఫెల్ నిర్ణయం వివాదాస్పదంగా మారింది. సిరాజ్ బౌలింగ్‌లో బంతి నేరుగా వెళ్లి స్టోక్స్ ప్యాడ్స్‌ను తాకింది. అప్పీల్ చేయగా రఫెల్ నాటౌట్ అని ప్రకటించాడు. దీంతో టీమిండియా ఆటగాళ్లు డీఆర్‌ఎస్ తీసుకున్నారు. అయితే రివ్యూలో అంపైర్స్ కాల్ ప్రకారం నాటౌట్ అని ప్రకటించారు. ఈ విషయంపై మాజీ ఆటగాడు ఆశ్విన్ (R Ashwin) స్పందిస్తూ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అంపైర్ రఫెల్‌పై ఆరోపణలు చేశాడు. రఫెల్ అంపైరింగ్ చేస్తున్న మ్యాచ్‌లో గెలవడం టీమిండియాకు కాస్త కష్టమేనని వ్యాఖ్యానించాడు.
'పౌల్ రఫెల్‌తో నాకున్న అనుభవం ప్రకారం ఎప్పుడూ అతడితో వాదిస్తూ ఉండాలి. టీమిండియా బౌలింగ్ చేస్తున్నప్పుడు అతడికి ఏదైనా నాటౌట్‌లాగానే కనిపిస్తుంది. అదే టీమిండియా బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మాత్రం ఏదైనా అవుట్‌లా అనిపిస్తుంది. ఇతర జట్లతో కూడా రఫెల్ ఇలాగే వ్యవహరిస్తున్నాడో, లేదో తెలియదు. ఈ విషయంపై ఐసీసీ ఒకసారి దృష్టి సారించాలి. పౌల్ రఫెల్ మైదానంలో ఉంటే ఇండియా గెలవదు అని మా నాన్న అంటుంటారు' అని అశ్విన్ తన యూట్యూబ్ ఛానెల్‌లో వ్యాఖ్యానించాడు.
ఇవీ చదవండి:
రహానె ప్లానింగ్ మామూలుగా లేదుగా!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి