Sourav Ganguly: లార్డ్స్ బాల్కనీలో గంగూలీ సంబరాలు.. జోఫ్రా ఆర్చర్‌కు ఎలా స్ఫూర్తినిచ్చాయంటే..
ABN , Publish Date - Jul 15 , 2025 | 01:13 PM
ఐదో రోజు ఆర్చర్ తీసిన ఆ రెండు వికెట్లే భారత పరాజయాన్ని శాసించాయి. అయితే జోఫ్రా ఆర్చర్ అద్భుత ప్రదర్శన వెనుక 2002 నాటి గంగూలీ ఐకానిక్ వేడుక స్ఫూర్తిగా పని చేసిందట. ఈ విషయాన్ని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ చెప్పాడు.

లార్డ్స్ (Lords)మైదానంలో భారత్‌తో జరిగిన మూడో టెస్ట్ మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్ అద్భుత ప్రదర్శన చేశాడు (India vs England). ఆర్చర్ అద్భుతమైన బంతితో ప్రమాదకర రిషబ్ పంత్‌ను అవుట్ చేశాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ ఇచ్చిన రిటర్న్ క్యాచ్‌ను అద్భుతంగా అందుకున్నాడు. ఐదో రోజు ఆర్చర్ (Jofra Archer) తీసిన ఆ రెండు వికెట్లే భారత పరాజయాన్ని శాసించాయి. అయితే జోఫ్రా ఆర్చర్ అద్భుత ప్రదర్శన వెనుక 2002 నాటి గంగూలీ (Sourav Ganguly) ఐకానిక్ వేడుక స్ఫూర్తిగా పని చేసిందట. ఈ విషయాన్ని ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ (Ben stokes) చెప్పాడు.
సరిగ్గా ఆరేళ్ల క్రితం అంటే 2019 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ జులై 14వ తేదీనే జరిగింది. లార్డ్స్ మైదానంలోనే జరిగిన ఆ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ విజయం సాధించింది. ఆ విజయం కాస్త వివాదాస్పదమే అయినప్పటికీ ఇంగ్లండ్ సాధించిన ఒకే ఒక ప్రపంచకప్ అది. తిరిగి ఆరేళ్ల తర్వాత అదే రోజున (జులై 14) భారత్‌తో మూడో టెస్ట్‌ను కూడా అదే లార్డ్స్ మైదానంలో ఇంగ్లండ్ గెలిచింది. ఐదో రోజు ఆటకు ముందు ఆర్చర్‌కు ఆ విషయాన్ని బెన్ స్టోక్స్ గుర్తు చేశాడట. ఈరోజు ఏంటో తెలుసా అని అడిగాడట.
బెన్ స్టోక్స్ 2019 ప్రపంచకప్ ఫైనల్ మ్యాచ్ గురించి అడిగితే.. జోఫ్రా ఆర్చర్ మాత్రం 2022 నాట్‌వెస్ట్ సిరీస్ ఫైనల్ మ్యాచ్‌ను గుర్తు చేసుకున్నాడట. ఆ మ్యాచ్ 2022, జులై 13వ తేదీన జరిగింది. ఆ మ్యాచ్‌లో ఇంగ్లండ్ నిర్దేశించిన 325 పరుగుల లక్ష్యాన్ని టీమిండియా ఛేదించింది. దీంతో లార్డ్స్ మైదానం బాల్కనీలో కూర్చున్న కెప్టెన్ గంగూలీ తన చొక్కా విప్పి గాల్లోకి ఊపుతూ సంబరాలు చేసుకున్నాడు. ఆ సంబరాలే ఆర్చర్ మదిలో ఉన్నాయట. దాంతో భారత్‌పై లార్డ్స్‌లో ఎలాగైనా గెలిచి తీరాలని ఆర్చర్ అనుకున్నాడట.
ఇవీ చదవండి:
ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీల పోటాపోటీ!
సిరాజ్ దొరికినా గిల్ తప్పించుకున్నాడు!
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి