Share News

Mohammed Siraj: అయ్యో.. సిరాజ్ బ్యాడ్‌లక్.. టీమిండియా ఎలా ఓటమి పాలైందో చూడండి..

ABN , Publish Date - Jul 15 , 2025 | 08:16 AM

విఖ్యాత లార్డ్స్‌ మైదానంలో ఉత్కంఠగా జరిగిన పోరులో టీమిండియా స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. చివరి క్షణం వరకు నువ్వా నేనా అన్నట్టు సాగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియాను దురదృష్టం వరించింది. 193 పరుగుల ఛేదనలో 112 రన్స్‌కే 8 వికెట్లు కోల్పోయిన గడ్డు స్థితిలో జడేజా వీరోచితంగా పోరాడాడు.

Mohammed Siraj: అయ్యో.. సిరాజ్ బ్యాడ్‌లక్.. టీమిండియా ఎలా ఓటమి పాలైందో చూడండి..
Mohammed Siraj out

విఖ్యాత లార్డ్స్‌ మైదానంలో (Lords Stadium) ఉత్కంఠగా జరిగిన పోరులో టీమిండియా స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. చివరి క్షణం వరకు నువ్వా నేనా అన్నట్టు సాగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియాను దురదృష్టం వరించింది (Ind vs Eng). 193 పరుగుల ఛేదనలో 112 రన్స్‌కే 8 వికెట్లు కోల్పోయిన గడ్డు స్థితిలో జడేజా (Ravindra Jadeja) వీరోచితంగా పోరాడాడు. మరో ఎండ్‌లో బుమ్రా, సిరాజ్ కూడా అతడికి అండగా నిలిచారు. అయితే చివరి సెషన్‌ ఆరంభంలోనే విజయానికి 22 పరుగుల దూరంలో భారత్‌ అద్వితీయ సమరానికి చెక్‌ పడింది.


చివరి వికెట్‌గా హైదరాబాదీ బౌలర్ మహ్మద్ సిరాజ్ (Mohammed Siraj) అవుట్ టీమిండియా ఫ్యాన్స్ గుండెలు పగిలేలా చేసింది. టీ బ్రేక్ తర్వాత స్పిన్నర్‌ బషీర్‌ ఓవర్‌లో సిరాజ్‌ ఐదో బంతిని బ్యాక్‌ఫుట్‌తో డిఫెన్స్ ఆడాడు. కింద పడిన బంతి సిరాజ్ ప్యాడ్స్‌ పక్కనుంచి వెళ్లి లెగ్‌ స్టంప్‌ను తాకింది. సిరాజ్‌ గమనించేలోపే బెయిల్స్‌ కూడా కిందపడిపోయాయి. దీంతో సిరాజ్ దిగ్భ్రాంతికి గురయ్యాడు. ఇంగ్లండ్ ఆటగాళ్లు, ఫ్యాన్స్ సంబరాలు మిన్నంటాయి. సిరాజ్ దురదృష్టవశాత్తూ అవుట్ కాకుండా ఉండుంటే ఫలితం మరోలా ఉండేదేమో.


ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా అద్భుత పోరాట పటిమను ప్రదర్శించాడు. టెయిల్ ఎండర్స్ అండతో ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. 150 బంతుల్లో తన కెరీర్‌లోనే నెమ్మదైన అర్ధసెంచరీని పూర్తి చేశాడు. ఓవర్‌లో నాలుగు నుంచి ఐదు బంతులు తానే ఆడడం.. చివరి బంతిని బౌలర్‌కు వదిలేయడం అనే ప్లాన్‌తో జడ్డూ బ్యాటింగ్‌ సాగించాడు. దీంతో బుమ్రా, సిరాజ్‌ను అవుట్ చేయడానికి ఇంగ్లండ్ బౌలర్లు నానా కష్టాలు పడ్డారు.


ఇవీ చదవండి:

ప్లేయర్ల కోసం ఫ్రాంచైజీల పోటాపోటీ!

సిరాజ్ దొరికినా గిల్ తప్పించుకున్నాడు!

ఎంత పని చేశావ్ ఆర్చర్?

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jul 15 , 2025 | 08:16 AM