Home » India vs England Test Series
ఓవల్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (142 బంతుల్లో 109 నాటౌట్) అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది.
ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా రెండో ఇన్నింగ్స్ ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 224 పరుగులు మాత్రమే చేసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (73 నాటౌట్) వేగంగా పరుగులు సాధిస్తున్నాడు.
తాజా సిరీస్‌లో ఒక్కసారి కూడా టాస్ గెలవని సాంప్రదాయాన్ని టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ కొనసాగించాడు. తాజా మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఇంగ్లండ్ కెప్టెన్ ఓలీ పోప్ బౌలింగ్ ఎంచుకున్నాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది.
ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరగాల్సిన చివరి మ్యాచ్ గురువారం నుంచి కెన్నింగ్ టవల్ మైదానంలో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు ఈ సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. చివరి మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తేనే సిరీస్‌ను డ్రా చేసుకోగలుగుతుంది.
చివరి రోజు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ సెంచరీలను అడ్డుకునేందుకు ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ వేసిన డ్రా ఎత్తులను కూడా టీమిండియా తిప్పికొట్టింది. ఈ నేపథ్యంలో మాజీ ఆటగాడు సునీల్ గవాస్కర్ టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు కొన్ని సూచనలు చేశాడు.
టీమిండియా కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తన క్లాస్ చూపిస్తున్నాడు. ప్రస్తుత సిరీస్‌లో నాలుగో సెంచరీ సాధించాడు. క్లిష్ట పరిస్థితుల్లో చేసిన ఈ సెంచరీ గిల్‌లోని అత్యుత్తమ ఆటగాడిని వెలికి తీసింది. 228 బంతుల్లో సెంచరీ చేసిన గిల్ అసలు సిసలైన టెస్ట్ ఇన్నింగ్స్ ఆడాడు.
మూడు, నాలుగు టెస్ట్ మ్యాచ్‌లకు మధ్యలో దాదాపు పది రోజుల విరామం వచ్చింది. నాలుగో టెస్ట్ మ్యాచ్ మంఛెస్టర్‌లో జులై 23వ తేదీ నుంచి ప్రారంభం కాబోతోంది. ఆ మ్యాచ్‌లో గెలిస్తేనే టీమిండియా రేస్‌లో నిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఈ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 2-1తో ఆధిక్యంలో ఉంది.
లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అద్భుత పోరాట పటిమను ప్రదర్శించాడు. 181 బంతులు ఆడి 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టీమిండియాను ఓడించేందుకు చివరి వరకు ప్రయత్నించాడు. అయితే దురదృష్టం వెంటాడడంతో టీమిండియా ఓటమి పాలైంది.
విఖ్యాత లార్డ్స్ మైదానంలో ఉత్కంఠగా జరిగిన పోరులో టీమిండియా స్వల్ప తేడాతో ఓటమిపాలైంది. చివరి క్షణం వరకు నువ్వా నేనా అన్నట్టు సాగిన టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియాను దురదృష్టం వరించింది. 193 పరుగుల ఛేదనలో 112 రన్స్‌కే 8 వికెట్లు కోల్పోయిన గడ్డు స్థితిలో జడేజా వీరోచితంగా పోరాడాడు.
లార్డ్స్ టెస్ట్‌లో ఎదురీదుతోంది టీమిండియా. నాలుగు రోజులు దుమ్మురేపిన భారత్.. ఐదో రోజు ఆటలో మాత్రం అంతగా ప్రభావం చూపలేకపోయింది. మన బ్యాటర్లంతా చేతులెత్తేశారు.