Share News

Ind vs Eng: నిలకడగా ఆడుతున్న భారత బ్యాటర్లు.. వంద దాటిన ఆధిక్యం..

ABN , Publish Date - Aug 02 , 2025 | 04:44 PM

ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ ఆడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 224 పరుగులు మాత్రమే చేసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో మాత్రం భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (73 నాటౌట్) వేగంగా పరుగులు సాధిస్తున్నాడు.

Ind vs Eng: నిలకడగా ఆడుతున్న భారత బ్యాటర్లు.. వంద దాటిన ఆధిక్యం..
Yashasvi Jaiswal

ఓవల్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా బ్యాటర్లు నిలకడగా ఆడుతున్నారు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ ఆడుతోంది (Ind vs Eng). తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 224 పరుగులు మాత్రమే చేసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ (73 నాటౌట్) వేగంగా పరుగులు సాధిస్తున్నాడు.


జైస్వాల్‌ (Yashasvi Jaiswal)కు తోడుగా నైట్ వాచ్‌మెన్ ఆకాశ్ దీప్ (32 నాటౌట్) కూడా చక్కటి ఇన్నింగ్స్ ఆడుతున్నాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు అజేయంగా 57 పరుగులు జోడించారు. దీంతో టీమిండియా ప్రస్తుతం 32 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 127 పరుగులు చేసింది. ప్రస్తుతానికి 104 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 247 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే.


కాగా, ఈ సిరీస్‌ను టీమిండియా డ్రా చేసుకోవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి తీరాలి. మూడో రోజు పూర్తిగా బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్ ఉంచాలని టీమిండియా కృత నిశ్చయంతో ఉంది. ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ వోక్స్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడం టీమిండియాకు కాస్త కలిసొస్తోంది.


ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 02 , 2025 | 04:44 PM