Ind vs Eng: ఇంగ్లండ్‌కు ఎదురుదెబ్బ.. ఐదో టెస్ట్‌కు కెప్టెన్ బెన్‌స్టోక్స్ దూరం..
ABN , Publish Date - Jul 30 , 2025 | 08:25 PM
ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరగాల్సిన చివరి మ్యాచ్ గురువారం నుంచి కెన్నింగ్ టవల్ మైదానంలో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు ఈ సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. చివరి మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తేనే సిరీస్‌ను డ్రా చేసుకోగలుగుతుంది.

భారత్‌తో ఐదో టెస్ట్ మ్యాచ్‌కు ముందు ఇంగ్లండ్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది (Ind vs Eng). ఆ జట్టు కెప్టెన్, ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ (Ben Stokes) గాయం కారణంగా చివరి టెస్ట్ ఆడడం లేదు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరగాల్సిన చివరి మ్యాచ్ గురువారం నుంచి కెన్నింగ్ టవల్ మైదానంలో ప్రారంభం కాబోతోంది. ఇప్పటికే ఇంగ్లండ్ జట్టు ఈ సిరీస్‌లో 2-1తో ఆధిక్యంలో ఉన్న సంగతి తెలిసిందే. చివరి మ్యాచ్‌లో టీమిండియా గెలిస్తేనే సిరీస్‌ను డ్రా చేసుకోగలుగుతుంది.
ఇలాంటి కీలక మ్యాచ్‌కు కెప్టెన్ బెన్ స్టోక్స్ దూరం కాబోతున్నాడు. కుడి భుజానికి గాయం కావడంతో స్టోక్స్ చివరి టెస్ట్ ఆడడం లేదు. ఈ సిరీస్‌లో బెన్ స్టోక్స్ అద్బుత ప్రదర్శన చేశాడు. మొత్తం 17 వికెట్లు తీసి ఈ సిరీస్‌లో టాప్ వికెట్ టేకర్‌గా నిలిచాడు. అలాగే ఏడు ఇన్నింగ్స్‌ల్లో ఒక సెంచరీతో సహా 304 పరుగులు చేశాడు. డ్రాగా ముగిసిన మాంచెస్టర్ టెస్ట్ మ్యాచ్‌లో ఆల్ రౌండ్ ప్రదర్శన చేసి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. కాగా, బెన్ స్టోక్స్ గైర్హాజరు నేపథ్యంలో ఓలీ పోప్ ఇంగ్లండ్ జట్టుకు నాయకత్వం వహించబోతున్నాడు. ఐదో టెస్ట్ మ్యాచ్‌లో ఆడబోయే తుది జట్టును ఇంగ్లండ్ జట్టు తాజాగా ప్రకటించింది.
ఇంగ్లండ్ తుది జట్టు: జాక్ క్రాలీ, బెన్ డకెట్, ఓలీ పోప్ (కెప్టెన్), జో రూట్, హ్యారీ బ్రూక్, జాకబ్ బెథెల్, జేమీ స్మిత్, క్రిస్ వోక్స్, గస్ అట్కిన్సన్, జేమీ ఓవర్టన్, జోష్ టంగ్
ఇవి కూడా చదవండి..
మాకు నువ్వేం చెప్పనక్కర్లేదు.. పిచ్ క్యూరేటర్‌తో గంభీర్ వాగ్వాదం..
మరిన్ని క్రీడా వార్తలు కోసం క్లిక్ చేయండి..