Share News

Yashasvi Jaiswal: జైస్వాల్ సూపర్ సెంచరీ.. 200 దాటిన టీమిండియా ఆధిక్యం..

ABN , Publish Date - Aug 02 , 2025 | 07:25 PM

ఓవల్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (142 బంతుల్లో 109 నాటౌట్) అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ ఆడుతోంది.

Yashasvi Jaiswal: జైస్వాల్ సూపర్ సెంచరీ.. 200 దాటిన టీమిండియా ఆధిక్యం..
Yashasvi Jaiswal Century

ఓవల్ మైదానంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న ఐదో టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ యశస్వి జైస్వాల్ (142 బంతుల్లో 109 నాటౌట్) అద్భుత సెంచరీతో చెలరేగాడు. ఐదు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా జరుగుతున్న చివరి టెస్ట్ మ్యాచ్‌లో టీమిండియా రెండో ఇన్నింగ్స్‌ ఆడుతోంది (Ind vs Eng). తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 224 పరుగులు మాత్రమే చేసిన టీమిండియా రెండో ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు దిశగా సాగుతోంది. ఓపెనర్ యశస్వి జైస్వాల్ వేగంగా పరుగులు సాధిస్తున్నాడు.


127 బంతుల్ల సెంచరీ చేసిన జైస్వాల్ టీమిండియా ఆధిక్యంలో కీలక పాత్ర పోషించాడు. టెస్ట్‌ కెరీర్‌లో జైస్వాల్‌కు ఇది ఆరో సెంచరీ. ఈ సిరీస్‌లో రెండో సెంచరీ. కాగా, ఆకాశ్ దీప్ (66) చూడచక్కని షాట్లతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆకాశ్ అవుటైన తర్వాత వచ్చిన శుభ్‌మన్ గిల్ (11), కరుణ్ నాయర్ (17) ఎక్కువ సేపు క్రీజులో నిలవలేకపోయారు. ప్రస్తుతం జైస్వాల్‌తో పాటు రవీంద్ర జడేజా (6 నాటౌట్) క్రీజులో ఉన్నాడు. ప్రస్తుతం 57 ఓవర్లలో టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 246 పరుగులు చేసింది.


ప్రస్తుతానికి టీమిండియా 223 పరుగుల ఆధిక్యంలో ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్ 247 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. కాగా, ఈ సిరీస్‌ను టీమిండియా డ్రా చేసుకోవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా గెలిచి తీరాలి. మూడో రోజు పూర్తిగా బ్యాటింగ్ చేసి ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్ ఉంచాలని టీమిండియా కృత నిశ్చయంతో ఉంది. ఇంగ్లండ్ బౌలర్ క్రిస్ వోక్స్ గాయం కారణంగా జట్టుకు దూరం కావడం టీమిండియాకు కాస్త కలిసొస్తోంది.


ఇవి కూడా చదవండి

ఇలా ఇన్వెస్ట్ చేయండి..రెండేళ్లలోనే రూ. 10 లక్షలు పొందండి..

ఆగస్టులో 15 రోజులు బ్యాంకులకు సెలవులు.. ముందే ప్లాన్ చేసుకోండి

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Aug 02 , 2025 | 07:25 PM