Ravindra Jadeja: మూడో టెస్ట్ ఓటమికి జడేజానే కారణం.. విమర్శకులకు పుజారా స్ట్రాంగ్ రిప్లై..
ABN , Publish Date - Jul 16 , 2025 | 01:31 PM
లార్డ్స్ టెస్ట్ మ్యాచ్‌లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా అద్భుత పోరాట పటిమను ప్రదర్శించాడు. 181 బంతులు ఆడి 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టీమిండియాను ఓడించేందుకు చివరి వరకు ప్రయత్నించాడు. అయితే దురదృష్టం వెంటాడడంతో టీమిండియా ఓటమి పాలైంది.

ఇంగ్లండ్‌తో లార్డ్స్ వేదికగా జరగిన మూడో టెస్ట్ (Lords Test Match) మ్యాచ్‌లో టీమిండియా స్వల్ప తేడాతో ఓటమి పాలైంది. 22 పరుగుల స్వ్పల తేడాతో పరాజయం మూటగట్టుకుంది. ఆ మ్యాచ్ రెండో ఇన్నింగ్స్‌లో ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా (Ravindra Jadeja) అద్భుత పోరాట పటిమను ప్రదర్శించాడు. 181 బంతులు ఆడి 61 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. టీమిండియాను గెలిపించేందుకు చివరి వరకు ప్రయత్నించాడు. అయితే దురదృష్టం వెంటాడడంతో టీమిండియా ఓటమి పాలైంది (India vs England).
టీమిండియా ఓటమి పాలవడానికి జడేజానే కారణమని కొందరు మాజీలు విమర్శిస్తున్నారు. జడేజా మొదటి నుంచే కాస్త వేగంగా ఆడి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదని కొందరు అభిప్రాయపడ్డారు. జడేజా డిఫెన్సివ్ మైండ్‌సెట్ కారణంగానే టీమిండియా ఓడిపోయిందని విమర్శిస్తున్నారు. టీమిండియా మాజీ క్రికెటర్లు గంగూలీ, అనిల్ కుంబ్లే, సునీల్ గవాస్కర్, అశ్విన్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వీరిపై మరో మాజీ క్రికెటర్ ఛతేశ్వర్ పూజారా (Cheteshwar Pujara) ఆగ్రహం వ్యక్తం చేశాడు. వారి వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చాడు.
'చివరి రోజు లార్డ్స్ పిచ్ చాలా మందకొడిగా ఉంది. బంతి కూడా సాఫ్ట్‌గా మారిపోయింది. అలాంటి పరిస్థితుల్లో వేగంగా ఆడడం కుదిరే పని కాదు. ఈ సిరీస్‌లో జడేజా బ్యాటింగ్ బాగుంది. నాలుగో ఇన్నింగ్స్‌లో అలా బ్యాటింగ్ చేయడం సులభం కాదు. టెయిలెండర్ల అండతో మ్యాచ్‌ను ముగించాలని జడేజా అనుకుని ఉండవచ్చు. అనవసరంగా వికెట్ పారేసుకోకూడదని జడేజా పట్టుదలగా ఆడాడు. అయితే అదృష్టం కలిసి రాలేదు' అని ఛతేశ్వర్ పూజారా అభిప్రాయపడ్డాడు.
ఇవీ చదవండి:
లార్డ్స్ బాల్కనీలో గంగూలీ సంబరాలు.. జోఫ్రా ఆర్చర్‌కు ఎలా స్ఫూర్తినిచ్చాయంటే..
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి