Sourav Ganguly: అతడిని జట్టులోకి తీసుకో: గంగూలీ
ABN , Publish Date - Nov 17 , 2025 | 12:14 PM
సౌతాఫ్రికాతో తొలి టెస్ట్‌లో భారత జట్టు 30 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో క్రికెట్ దిగ్గజం గంగూలీ.. హెడ్ కోచ్ గంభీర్‌కు ఓ కీలక సూచన చేశాడు.
ఇంటర్నెట్ డెస్క్: సౌతాఫ్రికాతో తొలి టెస్టులో టీమిండియా 30 పరుగుల తేడాతో ఓడిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌పై అందరూ విమర్శలు గుప్పిస్తున్నారు. కానీ క్రికెట్ దిగ్గజం, బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ(Sourav Ganguly) గంభీర్‌కు ఓ కీలక సూచన చేశాడు. స్టార్ పేసర్ మహ్మద్ షమీని తిరిగి జట్టులోకి తీసుకోవాలని సూచించాడు.
‘గంభీర్(Gautam Gambhir) అంటే నాకు చాలా అభిమానం. అతడు 2011, టీ20 ప్రపంచ కప్‌లలో అద్భుత ప్రదర్శన చేశాడు. గంభీర్ మరికొన్నాళ్లు టీమిండియా హెడ్ కోచ్‌గా కొనసాగాలి. కానీ అతడికి నేను ఒకటే చెప్తా.. స్వదేశంలో మంచి పిచ్‌లను ఎంచుకోవాలి. బుమ్రా, సిరాజ్, షమీ.. ఈ పేస్ త్రయంపై అతడు నమ్మకం ఉంచాలి. ఈ టెస్టులో షమీ(Shami)కి చోటు దక్కాలని భావిస్తున్నా. మంచి వికెట్లపై మ్యాచ్‌లు ఆడాలి. టీమిండియా బ్యాటర్లు 350కి పైగా పరుగులు చేయలేకపోతే.. ఆ టెస్ట్ మ్యాచ్ గెలవనట్లే. దీనికి ఉదాహరణ ఇంగ్లండ్ పర్యటనే. అక్కడ ఆటగాళ్లు భారీగా పరుగులు చేశారు. కాబట్టే అక్కడ రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించారు. కాబట్టి గౌతీ మంచి పిచ్‌లను ఎంచుకోవాలి. అప్పుడే టెస్టుల్లో టీమిండియా విజయం సాధిస్తుంది. అంతేకాదు టెస్టు మ్యాచ్‌లను ఐదు రోజుల్లో గెలవాలి కాని, మూడు రోజుల్లో కాదు’ అని గంగూలీ వివరించాడు.
ఫిట్‌నెస్ కారణంగా..
షమీ చివరిసారిగా భారత్ తరఫున 2023లో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఆ తర్వాత ఇంగ్లండ్, వెస్టిండీస్, సౌతాఫ్రికాతో సిరీస్‌లకు షమీని ఎంపిక చేయలేదు. ఫిట్‌నెస్ లేకపోవడంతో అతడిని జట్టులోకి తీసుకోవడం లేదని చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ పేర్కొన్నాడు. మరోవైపు, రంజీ ట్రోఫీలో ఆడుతున్న షమీ.. మంచి ప్రదర్శనలు చేస్తున్నాడు. నాలుగు మ్యాచ్‌ల్లో 17 వికెట్లు పడగొట్టాడు. మరి దాదా సూచనతో గంభీర్ షమీ గురించి ఆలోచిస్తాడమో చూడాల్సి ఉంది. కాగా నవంబర్ 22 నుంచి భారత్-సౌతాఫ్రికా మధ్య గువాహటి వేదికగా రెండో టెస్టు ప్రారంభం కానుంది.
ఇవి కూడా చదవండి:
గిల్ డిశ్చార్జ్.. నెక్ట్స్ ఏంటి?
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి