Prithvi Shaw: పృథ్వీ షా సంచలన నిర్ణయం.. చాన్సులు రాకపోవడంతో..!
ABN , Publish Date - Jun 23 , 2025 | 04:49 PM
టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ముంబై క్రికెట్ పెద్దలను సంప్రదించిన అతడు.. ఇకపై తాను ఏం చేయాలనుకున్నది వాళ్లకు స్పష్టంగా చెప్పేశాడని తెలుస్తోంది. మరి.. షా తీసుకున్న ఆ డెసిషన్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా క్రికెటర్ పృథ్వీ షా కఠిన నిర్ణయం తీసుకున్నాడని తెలుస్తోంది. ఇన్నాళ్లూ ఆడుతూ వస్తున్న ముంబై క్రికెట్‌ను అతడు వదిలేయాలని డిసైడ్ అయ్యాడట. మరో స్టేట్ టీమ్‌కు వెళ్లిపోతానని.. తక్షణమే నో ఆబ్జెక్షన్ సర్టిఫికేట్ (ఎన్‌ఓసీ) ఇవ్వాలని ముంబై క్రికెట్ అసోసియేషన్ పెద్దలను షా కోరాడట. వచ్చే దేశవాళీ సీజన్‌లో కొత్త జట్టు తరఫున బరిలోకి దిగాలని.. ముంబై నుంచి మరో టీమ్‌కు మారాలని అతడు డిసైడ్ అయ్యాడని సమాచారం. దీని గురించి మరింతగా తెలుసుకుందాం..
మారక తప్పట్లేదు..
కెరీర్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మరో స్టేట్ అసోసియేషన్‌కు మారాల్సిన అవసరం ఏర్పడిందని ముంబై అసోసియేషన్‌కు రాసిన లేఖలో షా స్పష్టం చేశాడట. మూడ్నాలుగు జట్ల నుంచి తనకు అవకాశాలు వస్తున్నాయని.. ముంబై నుంచి మరో టీమ్‌కు మారడం వల్ల ఒక క్రికెటర్‌గా తాను మరింత ఎదగగలనని అనిపిస్తోందని అందులో చెప్పుకొచ్చాడట. దీన్ని దృష్టిలో ఉంచుకొని మరో జట్టుకు అధికారికంగా మారేందుకు అవసరమైన ఎన్‌వోసీని ఇవ్వాలని కోరాడని వినిపిస్తోంది. దీని వల్ల వచ్చే దేశవాళీ సీజన్‌లో ఇంకో జట్టుకు ప్రాతినిధ్యం వహించగలనని ఎంసీఏ పెద్దలకు షా స్పష్టం చేశాడని తెలుస్తోంది.
టీమ్ నుంచి ఔట్..
పృథ్వీ షా విజ్ఞప్తిని ముంబై క్రికెట్ పెద్దలు ఇంకా పరిశీలిస్తున్నారని, అతడి లేఖపై తుది నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. కాగా, అప్పట్లో భారత అండర్-19 టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన షా.. టీమిండియా తరఫున 5 టెస్టులు, 6 వన్డేలు, ఒక టీ20 మ్యాచ్ ఆడాడు. ఫిట్‌నెస్ సమస్యలు, ఫామ్ కోల్పోవడం, అధిక బరువు, అవనసర వివాదాల కారణంగా మెన్ ఇన్ బ్లూలో చోటు కోల్పోయిన షా.. తిరిగి కమ్‌బ్యాక్ ఇవ్వలేకపోయాడు. ఫిట్‌నెస్ సమస్యలతో సతమతం అవుతుండటంతో గత రంజీ సీజన్‌లో అతడ్ని స్క్వాడ్ నుంచి తొలగించింది ముంబై. 2017 నుంచి దేశవాళీల్లో ఆ జట్టుకు ఆడుతూ వస్తున్న షా.. సరైన చాన్సులు దక్కకపోవడం, జట్టు నుంచి తీసేయడంతో ముంబై నుంచి మరో జట్టుకు మారక తప్పని పరిస్థితి ఏర్పడింది. మరి.. అతడి లేఖ విషయంలో ఎంసీఏ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి