T20 World Cup 2025: టీ20 ప్రపంచ కప్‌నకు కెనడా అర్హత
ABN , Publish Date - Jun 23 , 2025 | 03:05 AM
కెనడా జట్టు వచ్చే ఏడాది జరిగే పురుషుల టీ20 ప్రపంచ కప్‌నకు అర్హత సాధించింది. అమెరికా క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో కెనడా ఏడు వికెట్లతో బహామ్‌సను చిత్తు చేసింది.

ఒంటారియో (కెనడా): కెనడా జట్టు వచ్చే ఏడాది జరిగే పురుషుల టీ20 ప్రపంచ కప్‌నకు అర్హత సాధించింది. అమెరికా క్వాలిఫయింగ్ టోర్నీలో భాగంగా జరిగిన మ్యాచ్‌లో కెనడా ఏడు వికెట్లతో బహామ్‌సను చిత్తు చేసింది. ఐదు మ్యాచ్‌ల్లో ఆ జట్టుకిది వరుసగా ఐదో విజయం. కెనడా బౌలర్ల ధాటికి తొలుత ప్రత్యర్థి 19.5 ఓవర్లలో 57 పరుగులకే కుప్పకూలింది. అనంతరం 58 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కెనడా 5.3 ఓవర్లలో ఛేదించింది. ఇక 20 దేశాలు తలపడే మెగా టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ ఉన్న గ్రూపునుంచే కెనడా తలపడుతుంది. ఆఫ్రికా క్వాలిఫయర్స్ నుంచి రెండు, ఆసియా-ఈఏపీ క్వాలిఫయర్స్‌నుంచి మూడు, యూరప్ క్వాలిఫయర్స్ నుంచి రెండు జట్లు వరల్డ్ కప్‌నకు అర్హత సాధించనున్నాయి.