Ishan Kishan: దంచికొట్టిన సన్‌రైజర్స్ స్టార్.. టీమిండియా టికెట్ పక్కా!
ABN , Publish Date - Jun 23 , 2025 | 06:28 PM
ఒక సన్‌రైజర్స్ స్టార్ కౌంటీల్లో అదరగొట్టాడు. అరంగేట్రంలోనే ధనాధన్ ఇన్నింగ్స్‌తో మెరిశాడు. అతడు ఇలాగే ఆడుతూ పోతే త్వరలో టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.

భారత యువ ఓపెనర్ ఇషాన్ కిషన్ అదరగొట్టాడు. టీమిండియాలో రీఎంట్రీ కోసం ఎదురు చూస్తున్న ఈ సన్‌రైజర్స్ స్టార్.. అందుకోసం కౌంటీలను ఆశ్రయించాడు. అక్కడ పరుగుల వర్షం కురిపించి మెన్ ఇన్ బ్లూ టికెట్ కొల్లగొట్టాలని అనుకుంటున్నాడు. ఇలాంటి తరుణంలో కౌంటీల్లో ఆడిన తొలి మ్యాచ్‌లోనే ఇషాన్ హాఫ్ సెంచరీతో చెలరేగాడు. నాటింగ్‌హామ్‌షైర్ తరఫున బరిలోకి దిగిన లెఫ్టాండ్ ఓపెనర్.. 98 బంతుల్లో 87 పరుగుల ధనాధన్ ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. ఇందులో 12 బౌండరీలతో పాటు ఓ భారీ సిక్స్ ఉండటం విశేషం.
స్ట్రోక్ ప్లేతో..
ఫోర్లు, సిక్స్ ద్వారా 54 పరుగులు పిండుకున్నాడు ఇషాన్ కిషన్. 253 పరుగులకు 5 వికెట్లు కోల్పోయి నాటింగ్‌హామ్‌షైర్ కష్టాల్లో ఉన్న సమయంలో క్రీజులోకి అడుగు పెట్టిన స్టార్ బ్యాటర్.. సాలిడ్ స్ట్రోక్ ప్లేతో జట్టును ఒడ్డున పడేశాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి బౌలర్లను ఒత్తిడిలోకి నెట్టాడు ఇషాన్. క్రీజును వాడుకుంటూ మైదానానికి నలువైపులా భారీ షాట్లు బాదాడు. తన మీద ఉన్న ఒత్తిడిని అవతలి జట్టుపై నెట్టేశాడు. కిషన్ బ్యాటింగ్ చూసిన నెటిజన్స్.. త్వరలో అతడు టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వడం ఖాయమని అంటున్నారు. కాగా, 2023-24 సీజన్‌లో దేశవాళీ క్రికెట్‌కు డుమ్మా కొట్టాడు ఇషాన్ కిషన్. దీంతో అతడి కాంట్రాక్ట్‌ను తొలగించింది బీసీసీఐ. అప్పటి నుంచి జాతీయ జట్టుకూ అతడు దూరంగా ఉంటున్నాడు. మరి.. కౌంటీల్లో ఇదే తరహాలో విధ్వంసక ఇన్నింగ్స్‌లు ఆడుతూ పోతే సెలెక్టర్లు, బోర్డు అతడ్ని పరిగణనలోకి తీసుకుంటారేమో చూడాలి.
ఇవీ చదవండి:
మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి