Asia Para Badminton: భారత్‌కు 27 పతకాలు
ABN , Publish Date - Jun 23 , 2025 | 03:00 AM
థాయ్‌లాండ్‌లో జరిగిన ఆసియా పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ల్లో భారత షట్లర్లు గతంలో ఎన్నడూలేని విధంగా 27 పతకాలు కొల్లగొట్టారు. వీటిలో 4 స్వర్ణ, 10 రజత, 13 కాంస్య పతకాలున్నాయి..

ఆసియా పారా బ్యాడ్మింటన్
న్యూఢిల్లీ: థాయ్‌లాండ్‌లో జరిగిన ఆసియా పారా బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌ల్లో భారత షట్లర్లు గతంలో ఎన్నడూలేని విధంగా 27 పతకాలు కొల్లగొట్టారు. వీటిలో 4 స్వర్ణ, 10 రజత, 13 కాంస్య పతకాలున్నాయి. పారాలింపిక్ చాంపియన్ నితీశ్ కుమార్ ఏకంగా మూడు స్వర్ణాలు సొంతం చేసుకోవడం విశేషం. మహిళల సింగిల్స్ ఎస్‌యు5 కేటగిరీ ఫైనల్లో మనీషా రామ్‌దాస్ విజేతగా నిలిచింది.