Share News

IND vs ENG Pitch Report: పిచ్‌తో భయపెడుతున్న ఇంగ్లండ్.. గట్టిగానే బిగిస్తున్నారు!

ABN , Publish Date - Jun 18 , 2025 | 08:33 PM

భారత్-ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్‌కు మరికొన్ని గంటల్లో తెరలేవనుంది. లీడ్స్ వేదికగా జరిగే తొలి మ్యాచ్‌లో గెలవాలని రెండు జట్లు పట్టుదలతో కనిపిస్తున్నాయి.

IND vs ENG Pitch Report: పిచ్‌తో భయపెడుతున్న ఇంగ్లండ్.. గట్టిగానే బిగిస్తున్నారు!
IND vs ENG Pitch Report

టీమిండియా బిగ్ చాలెంజ్‌కు రెడీ అవుతోంది. ఇంగ్లండ్‌ను వాళ్ల సొంతగడ్డపై ఎదుర్కొనేందుకు సిద్ధమవుతోంది. ఈ రెండు జట్ల మధ్య 5 టెస్ట్ మ్యాచులు జరగనున్నాయి. వరల్డ్ టెస్ట్ చాంపియన్‌‌షిప్ నయా సైకిల్ షురూ అవుతున్న నేపథ్యంలో ఈ సిరీస్‌లో గెలిచి తీరాలని రెండు జట్లు పట్టుదలతో కనిపిస్తున్నాయి. లీడ్స్‌లోని హెడింగ్లీ వేదికగా జూన్ 20 నుంచి జరిగే తొలి టెస్ట్‌తో ఈ సిరీస్‌కు తెరలేవనుంది. ఈ నేపథ్యంలో మొదటి టెస్ట్ కోసం ఇంగ్లండ్ ఎలాంటి పిచ్‌ను తయారు చేస్తోంది? భారత్‌కు ఎలాంటి సవాళ్లు ఎదురవనున్నాయో ఇప్పుడు చూద్దాం..


దబిడిదిబిడే..

బౌలింగ్‌కు ఎక్కువగా అనుకూలించేలా లీడ్స్‌ పిచ్‌ను రూపొందించినట్లు తెలుస్తోంది. మొదటి రోజు పిచ్ ఫాస్ట్ బౌలర్లకు అనుకూలిస్తుందని, అనంతరం వేడి కారణంగా క్రమంగా ఫ్లాట్‌గా మారుతుందని వినిపిస్తోంది. పొడి వాతావరణం ఉండటం వల్ల రెండో రోజు నుంచి బ్యాటర్ల హవా నడిచే అవకాశాలు ఉన్నాయని సమాచారం. అయితే పేసర్లకు బౌన్స్, స్వింగ్‌ కూడా లభించే చాన్స్ ఉందని.. బజ్‌బాల్ క్రికెట్‌తో చెలరేగే ఇంగ్లండ్‌కు సరిపోయేలా పిచ్‌ను తయారు చేసినట్లు తెలుస్తోంది. ఇది తెలిసిన నెటిజన్స్.. మన బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో పిచ్‌ను ఇలా రూపొందిస్తున్నారని అంటున్నారు.


ముప్పు తప్పదు..

పేసుగుర్రం జస్‌ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని భారత బౌలింగ్ దళం ఊరుకోదని, ఇంగ్లండ్‌ను ముప్పుతిప్పలు పెట్టడం ఖాయమని నెటిజన్స్ చెబుతున్నారు. పేస్ కండీషన్స్‌ను వాడుకొని మన బౌలర్లు చెలరేగడం ఖాయమని.. ఆతిథ్య జట్టును గట్టిగా బిగించడం ఖాయమని చెబుతున్నారు. పేస్ వికెట్ వల్ల ఇంగ్లండ్‌కూ ముప్పు తప్పదని, బౌలింగ్‌తో పాటు బ్యాటింగ్‌కూ ఉపయోగపడేలా సమతూకమైన పిచ్‌ను రెడీ చేయిస్తే బాగుంటుందని కామెంట్స్ చేస్తున్నారు.


ఇవీ చదవండి:

నితీష్ వర్సెస్ శార్దూల్.. తేల్చేసిన రవిశాస్త్రి..

18 నంబర్ జెర్సీ.. సిరీస్‌‌లో ఇదే హైలైట్!

ఆ రోజే భారత్-పాక్ మ్యాచ్!

మరిన్ని క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Jun 18 , 2025 | 08:36 PM